దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లను ఖుషీ చేయ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంటుంది. మొట్ట మొద‌టిసారిగా భారతదేశంలో అతి చౌక ధ‌ర‌ల‌కే మొబైల్, డాటా సేవలను ఆరంభించి ఈ రంగంలో పోటీకి తెరలేపింది రిల‌య‌న్స్ జియో. ఇక ఇప్పటివరకూ తమ కస్టమర్లకు ఎన్నో ఆఫర్లు ఇచ్చిన ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో.. కొత్తగా వినియోగదారుల కోసం మరో బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. తాజాగా జియో.. త‌మ యూజ‌ర్ల కోసం ఓ అద్భుత‌మైన వార్షిక ప్లాన్ ను తీసుకువ‌చ్చింది.

 

అదే జియో వర్క్ ఫ్రం హోం వార్షిక ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా తన వినియోగదారులకు హై స్పీడ్ డేటాను అధిక మొత్తంలో అందించనుంది. ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు కాగా, రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. పూర్తి వివ‌రాల్లోకి ఈ జియో వర్క్ ఫ్రం హోం వార్షిక ప్లాన్ ఖరీదు రూ.2,399గా ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.  జియో నుంచి జియోకు ఫ్రీగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 12,000 నిమిషాలను అందిస్తారు. 

 

ఇక వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. నెలవారీ రీఛార్జ్ కష్టం అనుకేవాళ్లు... కొంత లాంగ్‌టైమ్‌కు చూస్తుంటారు.. అలాంటి వాళ్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగకరంగా ఉండనుంది. కాగా, జియోలో ఇప్పటికే రూ.2,121 వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీని 336 రోజుల పాటు అందిస్తారు. కాబట్టి ఈ రూ.2,121 ప్లాన్ కంటే ఇప్పుడు వచ్చిన రూ.2,399 ప్లానే అద్భుత‌మైన ప్లాన్ అని చెప్పుకోవ‌చ్చు. మ‌రియు రూ.2,121 ప్లాన్ కంటే వ్యాలిడిటీ, డేటా ఇలా అన్ని విషయాల్లో రూ.2,399 ప్లానే బెస్ట్‌గా క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: