వన్‌ప్లస్ 8టీ స్పెసిఫికేషన్లు వంటి ముఖ్యమైన వివారాలు లీకయ్యాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ త్వరలో లాంచ్ చేయనున్న వన్ ప్లస్ 8టీ స్పెసిఫికేషన్లు, ధర పూర్తి వివరాలు ఇవే.... ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం నాలుగు కెమెరాలు, 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వన్ ప్లస్ ఫోన్లు కెబాబ్ అనే కోడ్ నేమ్ తో తయారవుతున్నాయి అని చెప్పారు. ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించారు. వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రోలకు సంబంధించిన ఆండ్రాయిడ్ 11 డెవలపర్ ప్రివ్యూ సందర్భంగా ఇవి లీకయ్యాయి.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 11 పై పనిచేయనుండి.  8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో రానున్న మొదటి ఫోన్లలో ఇది కూడా ఉండనుంది. ఇదే ఈ ఫోన్ లో ప్రధాన హైలెట్. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే  వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండగా ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ ఉంది. దీంతో పాటు 16 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 5 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.

కంపెనీ ఇప్పటికి ఈ ఫోన్ గురించి ఎటువంటి సమాచారంని అందించలేదు. కానీ  వన్ ప్లస్ ప్రతియేటా రెండు ఫ్లాగ్ షిప్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తుంది. అందుకే త్వరలోనే వన్ ప్లస్ 8టీ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరి ధర కూడా ఇంకా బయటకి రాలేదు. అయితే ఈ సరికొత్త వన్ ప్లస్ 8టీలో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉండొచ్చంటున్నారు. అలానే  వన్ ప్లస్ 8లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను అందించగా, వన్ ప్లస్ 8 ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను అందించారు.





 

మరింత సమాచారం తెలుసుకోండి: