ఎల్జీ K42 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ ఫోన్ ఎటువంటి పరిస్థితులను అయినా తట్టుకునేలా రూపొందించడం విశేషం. మరి బడ్జెట్ రేంజ్‌లోనే రాబోతున్న ఎల్జీ  K42 పూర్తి వివరాలు చూడాల్సిందే..... మొదట  దీన్ని సెంట్రల్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ఫీచర్స్ లోకి వెళితే... వెనక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కెమెరా, దీంతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేక బటన్ అందించారు. అలానే ఈ ఫోన్ రెండు రంగులతో ఆకర్షిస్తోంది. గ్రీన్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ ధర గురించి ఏ సమాచారం లేదు. కోస్టారికా, డొమినిక్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గుటెమాలా, హొండురాస్, నికారాగ్వా, పనామాల్లో త్వరలో ఇది సేల్‌ కు వెళ్లనుంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం ఉంది.

ఫోన్ ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే విధంగా రూపొందించడం విశేషం. 6.6 అంగుళాల హెచ్ డీ + పంచ్ హోల్ డిస్ ప్లేను ఎల్జీ అందించింది. మీడియాటెక్ హీలియో పీ 22 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. అలానే బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 4000 ఎంఏహెచ్ గా ఉంది. మరి ఫీచర్స్ అయితే అదిరిపోయాయి కొనుగోలు చెయ్యడానికి అయితే కొన్ని రోజులు ఆగక తప్పదు.




మరింత సమాచారం తెలుసుకోండి: