తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు చుట్టూనే భారీ హైప్ నెలకొంది. ఆయన లేటెస్ట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శంకర వరప్రసాద్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ, అభిమానుల్లో మరోసారి చిరంజీవి మేనియాను పీక్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన ఫ్యామిలీ ఆడియెన్స్ పుల్‌ను నిరూపించడంతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సూపర్‌స్టార్‌గా తన స్థానాన్ని మరింత బలపరిచారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ లైనప్‌లో మరో ఊహించని, షాకింగ్ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు మారుతి… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ కాంబినేషన్ హాట్ టాపిక్‌గా మారింది.మారుతి గతంలో ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతి రోజు పండగే’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, తాజాగా వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో మారుతిపై కొంత నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. అలాంటి సమయంలోనే చిరంజీవి వంటి మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఊహించని కాంబినేషన్‌పై ప్రస్తుతానికి అంతగా సానుకూల స్పందన కనిపించడం లేదు. చాలామంది మెగా అభిమానులు, అలాగే న్యూట్రల్ ఆడియెన్స్ కూడా “మారుతి స్టైల్ ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్ ఇమేజ్‌కు ఎంతవరకు సూటవుతుంది?” అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మరికొందరు మాత్రం చిరంజీవి తన అనుభవం, మార్కెట్ మరియు కథల ఎంపికలో చూపించే తెలివితేటల వల్ల ఈ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడితేనే అసలు క్లారిటీ వస్తుంది . కానీ, ప్రస్తుతం మాత్రం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే యువ దర్శకులు బాబీ మరియు శ్రీకాంత్ ఓదెలతో భారీ సినిమాలను లైనప్‌లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. బాబీతో చేస్తున్న సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్‌గా, శ్రీకాంత్ ఓదెలతో చేసే చిత్రం ఒక పవర్‌ఫుల్ కంటెంట్ డ్రైవెన్ ప్రాజెక్ట్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇలా విభిన్నమైన కథలు, విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేస్తూ చిరంజీవి తన కెరీర్‌ను మరో కొత్త దశలోకి తీసుకెళ్తున్నారు.

ఇలాంటి సందర్భంలో మారుతితో కూడా ఒక సినిమా చేసే అవకాశం నిజంగా వస్తే, అది మెగాస్టార్ కెరీర్‌లో మరో ఆసక్తికర ప్రయోగంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ‘రాజా సాబ్’ ట్రోలింగ్ వల్ల మారుతి పేరు వార్తల్లో ఉండడం, అదే సమయంలో చిరంజీవి టీమ్ దృష్టిలో పడడం వంటివి కలిసి, ఈ అవకాశానికి కారణమయ్యాయేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ‘రాజా సాబ్’పై జరిగిన ట్రోలింగ్ కూడా మారుతికి అనుకోని లక్కీ ఛాన్స్‌గా మారిందని చెప్పొచ్చు.మొత్తానికి, మారుతిచిరంజీవి కాంబినేషన్ ప్రస్తుతం ఊహాగానాల దశలో ఉన్నప్పటికీ, ఇది నిజమైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో హాట్ ప్రాజెక్ట్‌గా మారడం ఖాయం. అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు అన్నీ ఇప్పుడు ఈ వార్తపై ఆసక్తిగా కన్నేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందో, మెగాస్టార్ ఇమేజ్‌కు మారుతి కథనం ఎలా సరిపోతుందో చూడాలి. అప్పటి వరకు మాత్రం ఈ షాకింగ్ కాంబినేషన్ తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగానే కొనసాగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: