ఈ సినిమాల ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకుండా, ప్రతి పాత్రకు తగినట్లుగా కొంత డిఫరెంట్‌గా ఉండాలని తాను ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. అందుకే ఇటీవల డైట్ పాటిస్తూ శరీరాకృతిని మార్చుకున్నానని వెల్లడించాడు. పాత్రల అవసరాలకు తగ్గట్టు తనను తాను మలుచుకోవడమే తన లక్ష్యమని కూడా తెలిపాడు.ఇంకా ఈ ఏడాది తనకు చాలా బిజీగా గడిచిందని, ఇప్పటికే పది సినిమాల్లో నటించినట్లు రేవంత్ చెప్పారు. వరుసగా అవకాశాలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, అయితే ప్రతి పాత్రలో కొత్తదనం చూపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన పట్ల తనకు ఉన్న గౌరవం, అభిమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నటుడు మెగాస్టార్ చిరంజీవితో ఒకసారి అయినా కలిసి పనిచేయాలని కోరుకుంటారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని అన్నాడు. అలాంటి అరుదైన అవకాశం తనకు లభించడం తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన సందర్భమని రేవంత్ భావోద్వేగంగా చెప్పారు. గతేడాది తాను చిరంజీవి సినిమాలో మాత్రమే నటించానని, ఆ అనుభవం తన కెరీర్‌లో మరచిపోలేని మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఇలా వరుస హిట్లు, ప్రముఖ హీరోలతో అవకాశాలు, విభిన్నమైన పాత్రలతో ముందుకు సాగుతున్న రేవంత్, భవిష్యత్తులో మరింత ఎత్తులకు చేరుకుంటాడని సినీ పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి