ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ లవ్‌టుడ్రీమ్ తెలియజేయడం జరిగింది. ఐఫోన్ 12 సిరీస్‌లో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్లు రానున్నట్లు ఈయన వెల్లడించారు. అయితే ఐఫోన్ 12 మినీ బ్యాక్ కవర్లు, కేసులు కూడా లాంచ్ అయినట్లు మరో టిప్ స్టర్ ద్వారా తెలిసింది. ఈ రానున్న ఐఫోన్ 12 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్ ఉన్నట్టు తెలుస్తోంది. అలానే ఐఫోన్ 12 మినీ డిజైన్.. ఐఫోన్ ఎస్ఈ 2020 తరహాలో ఉండనుందని కూడా అర్ధం అవుతోంది. మరి ధరని బట్టి వినియోగదారులు ఫోన్ ని కొనుగోలు చెయ్యవచ్చు.
ఇది ఇలా ఉండగా ఎప్పుడు మనం అనేక రూమర్స్ ని వింటాం. అందులోను కొత్త ఐఫోన్ల గురించి పుకార్లు రావడం కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనం వినడం సహజమే. కానీ ఐఫోన్లలో మినీ అనే పదాన్ని ఉపయోగించడమే చాల కొత్తగా ఉంది. ఇప్పటి వరకు కూడా శాంసంగ్ XR, SE వంటి పేర్లను తక్కువ ధర ఫోన్లకు ఉపయోగించింది. వచ్చే నెల వర్చువల్ ఈవెంట్ లో ఈ ఫోన్ గురించి చెప్పనున్నట్టు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి