భారతదేశంలో ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో అప్పటి నుంచి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల వేగం మొదలైంది. దేశంలోని మెజారిటీ ప్రజలు ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే ట్రాన్సాక్షన్లను చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక కరోనా కారణంగా ఈ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య మరింతగా పెరిగింది. నోట్ల ద్వారా కూడా కరోనా సోకుతుందని నిపుణులు హెచ్చరించడంతో ఈ కరోనా కాలంలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

అయితే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలా మంది ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ట్రాన్సక్షన్ చేసే సమయంలో ఒక్కోసారి డబ్బులు డెబిట్ అవుతాయి కాని ట్రాన్సాక్షన్ మాత్రం జరగదు. ఆ డబ్బులు మళ్లీ ఎప్పుడు వెనక్కు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే.. ఇలా ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న సమయంలో డబ్బులు డెబిట్ అయి తిరిగి రాకపోతే రోజుకు రూ. 100 అదనపు నష్టపరిహారాన్ని కస్టమర్లు పొందవచ్చు. భారతదేశంలో చాలా మందికి ఈ విషయం గురించి ఇప్పటివరకు తెలియదు.

2019 సెప్టెంబర్ 20 నుంచి bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ నగదును బ్యాంకు ఏడు రోజుల్లోగా రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. లేని యెడల ఎనిమిదో రోజు నుంచి బ్యాంకు కస్టమర్‌కు రోజుకు రూ. 100 నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ నష్టపరిహారాన్ని పొందాలంటే కస్టమర్ బ్యాంకుకు వెళ్లి అనెక్షర్ 5 ఫాంను నింపాల్సి ఉంటుంది. ఫాంను నింపిన తరువాత ఫిర్యాదు చేయాలి. కాబట్టి ఎవరైనా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్‌లో డబ్బులు పోగొట్టుకుని ఏడు రోజులైనా రీఫండ్ కాకపోతే.. వెంటనే బ్యాంకును సంప్రదించండి. ఫాంను నింపి న్యాయంగా బ్యాంకు నుంచి నష్టపరిహారాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: