.jpg)
.jpg)
మీరు ప్రొఫెషనల్ కెమెరాలను కొనడానికి ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.* కేవలం మంచి స్పెసిఫికేషన్ ఉంటే వెంటనే కొనేయకండి. ఆ కెమెరా యొక్క సిస్టం ఎలా ఉంది. లెన్స్ ల పనితీరును గమనించండి. ఇప్పటి వరకు ఆ సిరీస్ లో వచ్చిన మోడళ్లను అలాగే రాబోయే మోడల్స్ గురించి కొంచెం తెలుసుకుని కొనడం మంచిది.
* ఇప్పటి వరకు మీరు ఉపయోగించిన కెమెరా సిస్టం నుండి వేరొక సిస్టం ను కొనాలనుకుంటే వాటికి...ఇప్పుడు మీరు కొనబోయే సిస్టం కు మధ్యన ఉన్న సారూప్యతలు గమనించండి. కొత్త సిస్టం ను తీసుకొని కన్ఫ్యూజ్ అవడం కన్నా, ఇప్పటికే మీరు వాడుతున్న సిస్టం లో తరువాత మోడల్ ను తీసుకోవడం మంచిది.
* లెన్స్ లు మీకు ఏవి అవసరమో ముందుగా తెలుసుకోండి. మీరు వాడే లెన్స్ లతో ఇవి సరిపోతాయా లేదా ఇవి కొత్తగా ఉన్నాయా చూడండి. మనకు తెలిసి కేనన్ లేదా నికాన్ లెన్స్ బాగుంటాయి.
* ప్రొఫెషనల్ కెమెరాలలో ఎప్పటికీ మిర్రర్ కెమెరాలు అధిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంటే మీరు DSLR కెమెరాలను మాత్రమే ఎంపిక చేసుకోండి.
* కొంతమంది వీడియోలకు మాత్రమే కొన్ని కెమెరాలను వాడుతుంటారు. అలాగే మరికొందరు వీడియోలతో పాటు స్టిల్స్ ను సైతం తీయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ డ్స్లర్ మరియు మిర్రర్ లెస్ కామెర్లు రెండూ కూడా వీటికి సరిగ్గా సరిపోతాయి. అయితే అందరూ కూడా మిర్రర్ లెస్ కెమెరాలను వీడియోల కోసం సూచిస్తుంటారు.
ఈ విధంగా మీరు ప్రొఫెషనల్ కెమెరాను కొనాలి అనుకుంటే పై విషయాలను గుర్తుంచుకుని కొనడం ప్రధానం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి