టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు తాము వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ లో సరికొత్త టెక్నాలజీ ఉండాలని అనుకుంటూ ఉండటం సహజమే.. ఇక అందుకు తగ్గట్టుగానే మొబైల్ తయారీ సంస్థలు కూడా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్స్ ను  స్మార్ట్ ఫోన్స్ లో ప్రవేశపెడుతూ భారత మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మొబైల్ తయారీ సంస్థలు అయినటువంటి.. వివో, షియోమీ, వన్ ప్లస్, మైక్రో మ్యాక్స్ వంటి పలు కంపెనీలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇక వీటి ఫీచర్స్ కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.


1. వన్ ప్లస్ 9ఆర్ టీ:
120 Hz రీ ఫ్రెష్ రేట్ తో మనకు లభిస్తుంది..8GB ర్యామ్,  128GB స్టోరేజ్  వేరియంట్ తో పాటు 12GB ర్యామ్ , 256GB స్టోరేజ్‌  వేరియంట్ తో  స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో  భారత మార్కెట్ లో విడుదలైంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తో పాటు  16-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ అలాగే 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్-లెన్స్ కెమెరా సెటప్‌ మనకు అందించడం గమనార్హం. అంతే కాదు  16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ని అమర్చడం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకం..

2. వివో V23ప్రో 5G:
6.56 అంగుళాల పొడవున్న ఈ స్మార్ట్ ఫోన్ 44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది..4,300 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం కూడా కలదు..50-మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా సిస్టమ్‌ అమర్చబడగా.. రియర్ కెమెరా సెటప్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తో పాటు  8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ అలాగే 2-మెగాపిక్సెల్ మాక్రో స్నాపర్‌ కూడా వున్నాయి..


3.షియోమీ 11T ప్రో, 4. మైక్రోమ్యాక్స్ ఇన్ నోటు 2,5. రెడ్మీ 9 ఐ కూడా సరికొత్త ఫీచర్లతో ఈవారం భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: