ఓకేనావా okhi-90 ఎలక్ట్రిక్ బైక్..3.8kwh మోటార్ సహాయంతో ఈ బైక్ పనిచేస్తుంది. ఈ బైక్ ను రెండు విభాగాలుగా డిజైన్ చేయబడింది. ఈ ఎకో మోడల్లో గరిష్టంగా 55 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. అయితే స్పోర్ట్స్ మోడల్ లో మాత్రం 85 నుండి 90 కిలోమీటర్ల వరకు అందుకోగలరని ఆ సంస్థ తెలియజేసింది. ఈ బైక్ గరిష్ట గా 10 సెకన్లలోనే 90 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదట.
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొట్టమొదటి సారిగా 16 అంగుళాలు గా ఉండే టైర్లను అమర్చడం జరిగిందట. ఇంతవరకు ఇలాంటి e-bike నే ఏ సంస్థ విడుదల చేయలేదని ఓకినావా సంస్థ వారు తెలియజేశారు. ఇక వీటితో పాటుగా ముందు వెనుక భాగంలో ఎల్ఈడి లైట్స్ ను కూడా ఇచ్చారు. ఇన్ బుల్ట్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టువిటీ.. డిజిటల్ స్పీడోమీటర్ మరియు కొన్ని అత్యాధునిక ఫీచర్లతో కూడా ఈ బైకు కి అమర్చినట్లు తెలుస్తోంది. ఈ బైకులు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్ల వద్ద దొరుకుతాయని ఆ సంస్థ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి