ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ కి ఇదే ఆఖరి రోజు.. ఐఫోన్ 13 , గూగుల్ పిక్సెల్ సిక్స్ ఏ, నథింగ్ ఫోన్ వంటి పలు  బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. రూ. 30 వేల లోపు బ్యాంకింగ్ తో నథింగ్ ఫోన్ వన్ ని మీరు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో రూ.32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ఆ తర్వాత కాలంలో రూ. 29, 999కి దిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పై మరింత ఆఫర్ కూడా ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఈ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే రూ.20,000 లోపు కొనుగోలు చేయవచ్చు..

బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఉంటే మీరు ఈ డివైస్ ను రూ.2 వేల డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.  అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే 17,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది . అయితే మీ పాత ఫోన్ యొక్క ఎక్స్చేంజ్ వ్యాల్యూ మోడల్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర పాత శాంసంగ్ ఫోన్ ఉంటే గరిష్టంగా రూ. 10, 000 అన్ని డీల్స్ కలిపి రూ.16,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

అలాగే 6.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అధిక రిఫ్రెష్ రేటు 120 హెడ్జెస్.. హాస్టిక్ టచ్ మోటర్లు టెన్ ప్లస్ తో ముందు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కలిగి ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగే ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది . అలాగే128 జీబీ , 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది ఈ స్మార్ట్ ఫోన్.

మరింత సమాచారం తెలుసుకోండి: