ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్స్ లో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది.. ఇకపై మన మొబైల్ పోయిన ఎవరైనా దొంగలించిన.. ఆ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసిన ఈజీగా కనిపెట్టవచ్చట. ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఫైండ్ మై డివైస్ అనే నెట్వర్క్ ఫిచర్స్ తో ఈ రోజున గూగుల్ కంపెనీ లాంచ్ చేయబోతోంది.. దీంతో మనం ఎక్కడైనా మొబైల్ ని పోగొట్టుకున్న.. లేదంటే మర్చిపోయిన.. ఎవరైనా దొంగలించి స్విచాఫ్ చేసిన వాటి యొక్క లొకేషన్ ను సైతం ట్రాక్ చేయవచ్చట.. ఒకవేళ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన చివరి లొకేషన్ మనకి తెలియజేస్తుందట.


ఈ ఫీచర్ ప్రత్యేకత.. ఏమిటంటే మనం ఉపయోగించిన ఆండ్రాయిడ్ మొబైల్స్ , టాబ్లెట్స్.. వంటి వాటికి పెయిర్  చేసిన ఇయర్ బర్డ్స్, హెడ్ ఫోన్ల తో మనం ట్రాక్ చేసుకుని సదుపాయం ఉన్నదట. ఆండ్రాయిడ్ ఫోన్ తో లింక్ చేసిన ఈ వాలెట్స్ కిస్, బైకుల జాడను కూడా కనిపెట్టవచ్చట.. అందుకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ సైతం  find my device app ను సైతం google అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ లను ట్రాక్ చేయవచ్చు.. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే దీని జాడ గుర్తించలేము.. ఈ లోపాన్ని సైతం అధికమించడానికి ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ ను ఈరోజు గూగుల్ లాంచ్ చేస్తోంది..


ఆపిల్ కంపెనీ 2019లో మొదటిసారి బ్లూటూత్ బెస్ట్ ట్రాకర్ అనే ఒక ఎయిర్ ట్యాగ్  ను మొదలుపెట్టింది..


అప్పట్లో ఈ ఫీచర్ కేవలం ఐఫోన్, ఐపాడ్లకు మాత్రమే ఉండేది..


ఆ తర్వాత బ్లూటూత్ ఆధారంగా ట్రాకర్ ను గుర్తించి కనిపెట్టేందుకు ఆపిల్ సంస్థ గూగుల్ తో జతకట్టింది. దీంతో శ్యాంసంగ్, టెలి, యూపీ సెక్యూరిటీ ఇతర బ్రాండ్లకు కూడా స్పెసిఫికేషన్ మద్దతునిచ్చాయి.

ఈ బ్రాండ్లు ఉపయోగించే డివైస్లు అందరూ కూడా ట్రాకర్  నుంచి అలర్ట్ లు పొందవచ్చు.. అలాగే యాపిల్ కూడా ఈనెల ఆఖరుగా IOS 17.5 అప్డేట్ ను కూడా సరికొత్త యాంటీ స్టాకింగ్ ఫీచర్ ని తీసుకువస్తోంది.గూగుల్ కూడా ఈరోజు అదే సామర్థ్యం కలిగే విన్న సరికొత్త ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ యాప్ తీసుకువస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: