ఇటీవల కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఒకప్పుడు మనిషి అవసరాలను మాత్రమే తీర్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఆ మనిషినే బానిసగా మార్చేసుకుంది. ఏకంగా ఆరంగులాల మొబైల్ ఆరడుగుల మనిషిని ఒక ఆట ఆడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన అదునాతనమైన టెక్నాలజీ తో కావలసిన ప్రతి ఒకటి కూడా మొబైల్ లోనే దొరుకుతుంది.  రోజు వాడే వస్తువులు కూడా మొబైల్ లోనే ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయ్. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో బయట ప్రపంచంలో పని లేకుండా మొబైల్ లోనే కొత్త ప్రపంచాన్ని చూసేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి.


 ఇక పక్కనే ఉన్న  వాళ్ళతో మాట్లాడటం మానేసి.. మొబైల్ లో ఎక్కడో ఉన్న మనుషులతో మాట్లాడటం మొదలుపెట్టి చాలా రోజులే అవుతుంది. అయితే ఇలా మొబైల్ కి పూర్తిగా బానిసగా మారిపోయిన మనిషి ఒక్క నిమిషం పాటు మొబైల్ చేతులు లేకపోయినా పిచ్చి వాళ్ల లాగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. కొంతమంది అయితే ఏదో కోల్పోయినట్లుగా మొబైల్ చేతిలో లేకపోతే దిగాలుగా ఉండిపోతున్నారు. అలాంటిది ఏకంగా మొబైల్ పోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇక మొబైల్ ఎక్కడ పోయిందా అని వెతుక్కోవడం కోసం నానా పాట్లు పడుతూ ఉంటారు.


 అయితే ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో పోయిన మొబైల్ ని వెతకడం కూడా సులభతరమైంది. అయితే ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైనా దాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. ఆండ్రాయిడ్ లో ఫైండ్ మై డివైస్ సౌకర్యం ఉన్నప్పటికీ.. నెట్వర్క్ లేకపోతే మాత్రం పని చేసేది కాదు. కానీ గూగుల్ ఆ సౌకర్యాన్ని ఇప్పుడు అప్ గ్రేడ్ చేసింది. ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా సరే ఇక దాని సహాయంతో పోయిన ఫోన్ కనిపెట్టొచ్చట. ఆండ్రాయిడ్ 9 ఆపై వెర్షన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందట. ప్రస్తుతం అమెరికా కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫెసిలిటీ త్వరలోనే భారత్ లోకి కూడా రాబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: