ఇంటర్నెట్ డెస్క్: భూకంపం.. ఉన్నట్లుండి భూమి కంపించి ఎంత పెద్ద భవనాలనైనా క్షణాల్లో మట్టి దిబ్బగా మార్చేస్తుంది. వందల మంది ప్రాణాలను బలిగొంటుంది. అయితే ఈ భూకంపం ఎప్పుడొస్తుంది..? ఎలా దీనిని గుర్తించాలి..? అనేది మాత్రం పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్లు ఉంటే తప్ప కుదరదు. అయితే ఇలాంటి భూకంపానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరేళ్లబెడుతున్నారు.

క్రొయేషియాలోని ఓ ప్రాంతంలో అక్కడి ఓ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ సమస్య గురించి మీడియా ప్రతినిధులకు వివరిస్తున్నాడు. అయితే ఉన్నట్లుండి వారికి కాళ్ల కింద నేల కదులుతున్నట్లు అనిపించింది. కొద్ది క్షణాలు ఏమీ అర్థం కాలేదు. వారికి కానీ వెంటనే తేరుకుని అసలేం జరుగుతుందో గమనిస్తే.. నేల కదులుతోంది. ఉన్నట్లుండి నీటి అలల్లా ఎగిసి పడుతోంది. ఇంతలోనే పక్కనున్న ఓ భవంతి కుప్పకూలిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి మీడియా ప్రతినిధుల వీడియో కెమెరాల్లో రికార్డు అయింది.

మీడియా కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ వీడియో చూడగానే గుండె ఆగినంత పనైంది. అక్కడున్న అందరూ బాగానే ఉన్నారని భావిస్తున్నా.. కొత్త సంవత్సరం ముందు ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరం’ అంటూ కొందరు ట్వీట్ చేస్తుంటే.. మరికొదరేమో ‘అమ్మ దేవుడా.. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. అదృష్టం... ఎక్కువమంది బయటే ఉన్నారు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదయింది. దురదృష్టవశాత్తూ ఈ భూకంపం ఘటనలో ఏడుగురు చనిపోగా 20మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: