మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం దేవుడి గుడికి వెళితే ఎక్కువగా కొబ్బరికాయలు, పండ్లు ఇతరాత్ర ఆహార వంటకాలు ప్రసాదంగా పెట్టే విషయం అందరికీ తెలిసిందే. కాని దేశంలో ఒక్కొక్క ప్రాంతం దగ్గర ఒక్కొక్క సంప్రదాయం అనేది నెలకొని ఉంది. ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పాటిస్తూ పూర్వకాలం నుంచి అవలంబిస్తూ వస్తున్నారు. కొన్ని సంప్రదాయాలు మనకి వింతగా అనిపించినా అవి వారికి ప్రత్యేకమైన సంప్రదాయాలుగా ఉంటాయి. అయితే అమృత్సర్లో ఒక దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా మద్యం ఇస్తారు. మరెక్కడో తెలుసుకుందామా..?

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో దాదాపుగా 90 సంవత్సరాలుగా ఒక వింత ఆచారం పాటిస్తారు. అక్కడ బాబా రోడే షా ఆలయం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. జాతర సమయంలో భక్తులకు మద్యాన్ని పంచుతారు. ఇందులో భాగంగా భక్తులు మద్యాన్ని స్వామివారికి అర్పిస్తారు. కానీ మన దేశంలో అనేక మతాలు, కులాలు మరియు ఆచారాలు సాంప్రదాయాలు, సంస్కృతులు పాటిస్తూ ఉంటారు. భారత దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇతర మతాల నమ్మకాలను  పద్ధతులకు కూడా గౌరవం ఇస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వింత సాంప్రదాయాలు వింత పద్ధతులు కూడా ఉంటాయి. వీటి వెనుక ఏదో ఒక కచ్చితమైన కారణం ఘనచరిత్ర కలిగి ఉంటుంది. అయితే ఈ భిన్నమైన ఆచారం పంజాబ్లోని అమృత్సర్లోని ఒక దేవాలయంలో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమృత్సర్ లోని పతేగడ్ ఈ ప్రాంతంలోని చూరియన్ రోడ్డు మార్గం గుండా ఆలయానికి చేరుకోవచ్చు.

 బొమ అనే గ్రామంలో  బాబా రోడ్ షా మందిరం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా భక్తులకు మధ్యన్ని ప్రసాదంగా పంచి పెడతారు. అయితే దీని వెనుక ఒక యదార్థ చరిత్ర ఉందని స్థానిక సర్పంచ్ గుర్నేక్ సింగ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావన్ గ్రామనికి చేసినటువంటి బాబా 1896లో తన కుటుంబాన్ని విడిచి బొమ లో స్థిరపడ్డారు. అక్కడ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆయనకు ఎవరూ లేరని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: