
కానీ ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాలు మంచినీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత అర్థమవుతూ ఉంటుంది. గుక్కెడు నటి కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న మనుషులు ఇంకా ఉన్నారు అన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. మహారాష్ట్రలోని గంగోద్వారీ గ్రామానికి చెందిన మహిళలు, ఆడపిల్లలు నీళ్ల కోసం చేస్తున్న సాహసం చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. వేసవికాలం కావడంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇక ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావులు కూడా ఎండిపోయాయి.
దీంతో గ్రామానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి.. బిందెలు, క్యాన్లతో మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు ఆ గ్రామస్తులు. అయితే ఇలా మూడు కిలోమీటర్ల నడవడం ఇబ్బంది లేకపోయినప్పటికీ 70 అడుగుల లోతు ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆ బావిలోకి దిగడం తప్ప మరో మార్గం లేదు. దీంతో ఆ ఊరి జనం మంచినీళ్ల కోసం ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. అయితే తమ గ్రామంలో నీటి కొరత ఇప్పటిది కాదని.. పదేళ్లుగా వేసవి వచ్చిందంటే ఇదే పరిస్థితి నెలకొంటుందని.. ఆ ఊరి సర్పంచ్ చెబుతున్నాడు. గ్రామంలో భావి తవ్వించడానికి లేదంటే మంచినీటి ట్యాంకులు తెప్పించడానికి పంచాయతీ నిధులు సరిపోవడం లేదంటూ చెబుతున్నాడు. ప్రభుత్వమే ఈ విషయంపై స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు సర్పంచ్ మోహన్ .