ఈ ప్రపంచంలో ఒక ప్రాణి కడుపు నిండాలంటే మరో ప్రాణి దానికి ఆహారం అవ్వాల్సిందే.. ఇలా ఈ జీవన చక్రం ఒకదానిపై ఒకటి ఆధారపడి ముందుకు సాగుతుంది.. మనుషులు నాగరికత నేర్చుకున్నారు కాబట్టి వేటాడటం మానేశారు.. కానీ ఒక మనుషులు తప్పా దాదాపుగా మిగతా వేరే జీవి ఏది కూడా వేటాడకుండా జీవించలేదు.. అడవిలో కానివ్వండి, నీటిలో కానివ్వండి.. ఒక ప్రాణం బ్రతకాలంటే మరో జీవిని వేటాడి తినడం తప్ప వేరే మార్గం లేదు.. ఇక ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశుల్లో అన్ని ఒకే రకమైనా ఆహార అలవాట్లు కలిగి ఉండవు.. వాటి రూపాన్నిబట్టి ఆహార అలవాట్లు ఉంటాయి..

 

 

ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక పెద్ద చేప, ఈల్ ఫిష్ ను, అంటే పాములా ఉన్న చేపను వేటాడం కనిపిస్తుంది.. ఇక్కడ ఒక కామన్ పాయింట్ గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచంలో సుమారుగా అన్ని ప్రాణులు గానీ, జీవులు గానీ రెప్ప వేయకుండా ఉండలేవు.. కానీ చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి.

 

 

ఇక వాటికి ఆకలి వేస్తే వాటికన్నా చిన్న ప్రాణులను, లేదా నీటిలో ఉన్న మొక్కలను, నాచును తింటూ బ్రతికేస్తాయి.. కానీ ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక బిగ్ ఫిష్, ఈల్ ఫిష్ ను వేటాడటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. దీన్ని కక్కూర్తి అనాలో ఏమో తెలియదు గానీ పాములా పొడవుగా ఉన్న చేపను బలవంతంగా మింగాలని చేస్తున్న ప్రయత్నం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.. ఇక ఇతర చేపలను వేటాడే కొన్ని రకాల చేపల వేట, భిన్నంగా ఉంటుందని తెలుసుగానీ మరీ ఇంతనా అని నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారట.. ఇక వైరల్ గా మారిన ఈ వీడియోను మీరుచూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: