మన దేశంలో పావురాలు, చిలుక పక్షులు తిరుగుతుండటం సర్వసాధారణం. అలాగే కోళ్లు కూడా మనతో పాటు జీవిస్తూ ఉంటాయి. అదే విదేశాల్లో అయితే ఎక్కువగా సీగల్ పక్షులనేవి తిరుగుతూ ఉంటాయి. అవి తెల్లగా, గుండ్రటి ముఖంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పక్షులు సామాన్యంగా నదుల్లో, సముద్రాల్లో జీవిస్తుంటాయి. అయితే విదేశాల్లో మాత్రం రానురాను మనదేశంలో కోళ్లు జీవిస్తున్నట్లుగా ఇది అక్కడ మనుషులతో జీవించేస్తున్నాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల దగ్గర జీవిస్తూ కావాల్సిన ఆహారాన్ని పొందుతున్నాయి. అయితే వీటి వల్ల సామాన్యులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. ఈ పక్షులు రానురాను దొంగల్లా తయారవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. జనాలు తమ కావాల్సిన ఆహారాలను తీసుకెళ్తున్నప్పుడు ఇవి ఎత్తుకెళ్లిపోతున్నాయి. దీంతో ఈ పక్షులు వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఈ పక్షులపై వ్యతిరేకత అనేది పెరిగిపోతూ వస్తోంది. తాజాగా ఓ టూరిస్ట్ ను ఇవి తంటాలు పడేలా చేశాయి.

సముద్రం పక్కన ఉన్న ఓ స్టాల్ నుంచి రొయ్యలతో తయారుచేసిన స్నాక్స్‌ని కొనుక్కొని వెళ్తుంటే సీగల్ పక్షులు అక్కడికి వచ్చి రహస్యంగా ఆ రొయ్యలను ఎత్తుకుపోయింది. దీంతో అక్కడున్నవారు దీనిని చూసి అవాక్కయ్యారు. ఈవిధంగానే మరో సీగల్ పక్షి ఇంకో వ్యక్తి వద్ద ఉన్న స్నాక్స్ ని ఎత్తుకుపోదాం అనుకుంది. ఆ టూరిస్ట్ మహా తెలివైన వాడు అవ్వడం వల్ల సరిగ్గా టైమ్ చూసి పిడికిలి బిగించి పక్షి దగ్గరకు రాగానే పొట్టకు తగిలేలా ఓ షాట్ ఇచ్చాడు. అంతే ఆ పక్షి అక్కడి నుంచి తిరిగి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.  ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు వైరల్ అయ్యింది. దీన్ని రెడ్డిట్‌లో ఓ యూజర్ పోస్ట్ చేయడంతో అందరూ వైరల్ చేస్తున్నారు. ఇలా పక్షికి పంచ్ ఇవ్వడం పక్షి ప్రేమికులకు నచ్చలేదు. ప్రస్తుతం ఈ పక్షుల గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: