కొన్ని విషయాలు అనేవి మనకు చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తాయి. అసలు అవి ఇలా ఎలా సాధ్యం అన్న అనుమానం మనకు కలుగుతుంది. తాజాగా ఇటలీలో ఇలాంటి వింత ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ ఘటన గురించి చెబితే నిజంగా ఆశ్యర్యపోవడం ఖాయం. ఇటలీలోని అక్వేరియో కాలా గోనోన్ అక్వేరియంలో ఓ సొర చేప బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చేప మగ జన్యువు అంటే తండ్రి లేకుండా పుట్టడం జరిగింది.ఈ వింత ఘటన అక్కడ ఉన్నవారిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇలాంటి విచిత్ర సంఘటన ప్రపంచంలో ఇంతకు ముందు ఎక్కడా జరగ లేదు. మగ తోడు లేకుండా ఆ ఆడ సొర చేప బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని అక్వేరియం సిబ్బంది ధృవీకరించడం జరిగింది.

గత పది ఏళ్ళుగా రెండు ఆడ సొరచేపలు అక్వేరియంలో ఉన్నాయని, ఇప్పుడు ఒక సొర చేప మగ తోడు లేకుండానే బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ విచిత్ర ఘటనపై సంబంధిత నిపుణులు స్పందించడం జరిగింది. పార్థినోజెనిసిస్ నరుత్పత్తి కారణంగా ఇలా జరిగే అవకాశం ఉందని వారు వెల్లడించడం జరిగింది.ఇక పార్థినోజెనిసిస్ అంటే అలైంగిక పునరుత్పత్తి.  ఇందులో అండం స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండానే పిండంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక ఈ బుల్లి సొరచేప తన తల్లి సొర చేపకి క్లోన్ అని నిపుణులు భావించడం జరుగుతుంది. ఒక అండం 
పూర్తిగా ఎదగని మరొక అండంతో ఫలదీకరణం చేసినప్పుడు ఈ రకమైన పునరుత్పత్తి అనేది జరుగుతుందట.ఇక ఇక్కడ పూర్తిగా ఎదగని అండం ఒక విధంగా స్పెర్మ్ లాగా ప్రవర్తిస్తుంది.అందువల్ల ఇలాంటి విచిత్ర సంఘటనలు అనేవి జరుగుతాయి.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 


 https://youtu.be/V2hXZb-nhlI

మరింత సమాచారం తెలుసుకోండి: