నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. అన్నం లేకున్నా మనం బతుకుతాము గానీ.. నిద్ర లేకుండా అస్సలు బతకలేము. అందుకే మనిషికి సరైన నిద్ర అనేది ఎంతో ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా రోజులో 8 గంటలు నిద్ర పోవాల్సిందేనని నిపుణులు తెలిపారు. డబ్బ్యుహెచ్ఓ కూడా 8 గంటల నిద్రపోవడం ఎంతో ఉత్తమమని తెలియజేసింది. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ టెక్నాలజీ యుగంలో నిద్ర అనేది మనిషికి దూరమవుతోంది. నిద్ర మీద ధ్యాస ఉండటం లేదు. కానీ ఈనాటి రోజుల్లో కూడా రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి ఏడాదికి 300 రోజులు నిద్రపోతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దీనిపై పూర్జారామ్ మాట్లాడుతూ.. ఇలా నిద్రపోవడం తనకు 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి మొదలైందని తెలిపాడు. అతను మేల్కోవాలి అని అనుకున్నప్పుడు తన బాడీ అతనికి సహకరించేది కాదని తెలిపాడు.

ప్రారంభంలో 18 గంటల పాటు అతను పడుకుని నిద్రపోయేవాడని తెలియజేశాడు. అయితే రాను రాను నెలలో 5 నుంచి 7 రోజుల పాటు నిద్రపోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత నెలలో 20 నుంచి 25 రోజుల పాటు నిద్రపోయేవాడని తెలిపాడు. ఇలా ఏడాదికి సుమారుగా అంటే 300 రోజుల పాటు నిద్రలోనే ఉండేవాడని పేర్కొన్నాడు. పూర్జారామ్ భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం వల్ల తనకు ఎన్నో సమస్యలు వచ్చాయని బాధపడింది. తన భర్త ఇలా నిద్రపోవడం తనకు ఎంతో ఇబ్బందిని కలిగించిందని తెలిపింది. ఎవ్వరి దగ్గరకు వెళ్లినా కూడా తన భర్త ప్రాబ్లమ్ ఏంటో ఎవ్వరూ చెప్పేవారు కాదని, కొందరు డాక్టర్లు అయితే తన భర్తకు ఉన్న వ్యాధి హైపర్సోమ్నియా అని చెప్పారని తెలిపింది. తన భర్త సంవత్సరంలో ఇలా నిద్రపోతూనే ఉంటాడని, అందుకే ఆయన్ని అందరూ కుంభకర్ణుడు అని పిలుస్తున్నట్లు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: