బాలు  లేటె స్ట్ సాంగ్  ఇదీ


 లెటెస్ట్ సాంగ్స్  ఇష్టపడిని వారెవరుంటారు ?.  అది కూడా శ్రీపతి పండితా రాధ్యుల బాల సుబ్రమణ్యం అలియాస్ ఎస్.పి.బి , ఉరఫ్ బాలూ పాట. అయన కోవిడ్-19 మూలంగా గత ఏడాది ఆస్పత్రి పాలై మరణించి ఏడాది పూర్తయింది. ఆయన పాడిన పాటలు  సంగీతాభిమానుల  మదిలో చిరస్థాయిగా నిలచి పోయాయి. ఆయన ప్రతి కుటుంబంలోనూ ఒకరుగా  తన పాటలతో  పెనవేసుకున్నారు. దాదాపు నలభై వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు కెక్కారు. ఆయన పాటే కాదు,మాట కూడ అపురూపమే.
ఆ మహనీయ్యుడి పాట సినీ రంగంలో మరలా కొత్తగా వినిపించదని  బాధ పడని వారుండరు. రజనీకాంత్  నటించిన 'అణ్ణాత్తే అణ్ణాత్తే' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి తొలి పాటను నిర్మాతలు విడుదల చేశారు. అందులో టైటిల్ సాంగ్ ను ఎస్.పి. బాలసుబ్రమణ్యం పాడారు. కోవిడ్-19 కారణంగా నూతన చిత్రాలు నిర్మాణానికి నోచుకో లేదు. అప్పటికే అరకొరా పూర్తయిన సినిమాలు పూర్తి కాలేదు. పూర్తయిన సినిమాలను నిర్మతలు విడుదల చేయలేదు. కొద్దో గొప్పో సినిమాలు ఓటిటి లలో విడుదల అవుతున్నా..ఎక్కువ మంది నిర్మాతలు మాత్రం సినిమా థియోటర్లలోనే నిడుదల చేయాలని  తాను నిర్మించిన సినిమాలు నిలిపి ఉంచారు.  రజనీ కాంత్ నటించిన చిత్రం అణ్ణాత్తే..అణ్ణాత్తే  చిత్రంలోని పాటను తమిళంలో విడదల చేశారు.  నలభై ఐదు సంవత్సరాలుగా బాల సుబ్రణ్యం నాలో ఒక భాగం . నా ఎదుగుదలకు ఆయన గొంతు ఊపిరి పోసింది. ఆయన పాట నా తాజా చిత్రంలో ఉండటం నా అదృష్టం అని  సినీ నటుడు రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. రచయిన వివేక్ రాసి ఈ పాట ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.  మహానటి సినిమాతో అవార్డుల  పంట పండించుకున్న నటి కీర్తి  సురేష్, ప్రకాశ్ రాజ్ లు  ఇందులో ప్రధాన పాత్ర పోషస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: