ఏలియన్స్.. సినిమాల్లో, సోషల్ మీడియాలో తప్ప నేరుగా కళ్ళతో చూసిన వారు ఎవరూ లేరు అని చెప్పాలి. వేరే గ్రహంపై ఏలియన్స్ ఉన్నాయని ఇక ఏలియన్స్ తో మానవాళికి ముప్పు వాటిల్లుతుందని అటు శాస్త్రవేత్తలు మాత్రం ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఏలియన్స్ ఎవరికీ తెలియకుండా భూమ్మీదికి కూడా వస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అసలు నిజంగా ఏలియన్స్ ఉన్నాయా.. మనుషులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా అన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే అప్పుడప్పుడు ఏలియన్స్ కు సంబంధించిన స్పెస్ షిప్స్ ఆకాశంలో కదులుతున్నట్లుగా కొన్ని ఆధారాలను కూడా శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.



 ఇక కొన్ని కొన్ని సార్లు రాత్రి సమయంలో ఆకాశంలో ఏదో చిత్ర విచిత్రంగా కనిపించడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది జమ్మూ కాశ్మీరు తోపాటు పంజాబ్లోని పటాన్ కోట్ లో ఆకాశంలో అంతుచిక్కని లైట్లు ప్రత్యక్షమయ్యాయి.. దీంతో ఇది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ఆకాశంలో  వెళ్తున్న అంతుచిక్కని లైట్లు దేనికి సంబంధించినవి అని ఆలోచనలో పడిపోయారు అందరూ. ఇక దీనికి సంబంధించిన వీడియో ని సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.



 జమ్మూ కాశ్మీర్ తోపాటు పంజాబ్లోని పటాన్ కోట్ సాయంత్రం ఆరు  గంటల యాభై నిమిషాలకు  ఐదు నిమిషాల పాటు విచిత్రమైన లైట్లు ఆకాశంలో కనిపించాయ్ అని స్థానికులు చెబుతున్నారు. ఆకాశంలో కనిపించిన లైట్లు అచ్చం రైలు బోగి లాగా వరుసగా ఉండి మెరుస్తున్నాయి అంటూ తెలిపారు. ఈ వీడియోలో కూడా దీనికి సంబంధించిన ఫుటేజ్ కనిపించడం గమనార్హం. అయితే అది ఒక శాటిలైట్ అంటూ అధికారులు నిర్ధారించారు. అది ఎలాన్ మస్క్  కు చెందిన ఒక శాటిలైట్ అంటూ మరికొంతమంది తెలిపారు.. కొంతమంది ఖచ్చితంగా ఏలియన్స్ అయి ఉంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: