అడవికి రారాజు సింహం.. అడవిలో ఉండే ప్రతి జంతువు కూడా సింహానికి భయపడుతుంది అని చెప్పాలి.  ఇక మనుషుల విషయానికి వస్తే సింహం టీవీలో కనిపిస్తేనే ఒక్క సారిగా గుండె జారి పోయినంత పని అవుతుంది. అలాంటిది ఇక నేరుగా సింహాన్ని చూడటం అంటే ఇక అది చాలా సాహసం చేయడమే అని ఫీల్ అవుతూ ఉంటారు జనాలు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా జూ పార్క్ లో కూడా సింహాలను చూస్తూ భయపడిపోతుంటారు. ఇలా దూరం నుంచి సింహాన్ని చూసిభయపడే జనాలు ఇక సింహం నేరుగా ఇంటి ముందు ప్రత్యక్షం అయితే ఏం చేస్తారు... అమ్మో ఇక అలా ఊహించుకోవడానికి భయంగా ఉంది అనిపిస్తుంది కదా.


 కానీ ఇక్కడ ఒక మహిళకు మాత్రం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏకంగా ఇంటి ఆవరణలో కి ఒక భారీ సింహం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆ మహిళ భయపడుతున్న సమయంలో ఆ మహిళ పెంచుకునే కుక్క పిల్ల మాత్రం సింహం తో పోటీ పడతా అన్న విధంగానే నిలబడింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన జర్మనీలోని కన్యాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. సారా అనే మహిళ తన పెంపుడు కుక్క తో అద్దాల గదిలో ఆడుకుంటుంది. ఇంతలో అటువైపు నుండి ఒక భారీ సింహం వచ్చింది.


 సింహాన్ని చూసిన ఆ మహిళా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క పిల్ల అద్దం దగ్గరికి వెళ్లి సింహాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలోనే సింహం కూడా ఆ కుక్క పిల్లను గమనించింది. అద్దం దగ్గరికి వచ్చి సింహం నిలబడింది. ఇంతలో ఇక ఆ కుక్క యజమాని మరింత భయపడిపోయింది. వెనక్కి రావాలి అంటూ కుక్కకు చెప్పింది. కానీ ఆ చిన్ని కుక్క మాత్రం సింహాన్ని చూస్తూ అక్కడే నిలబడింది. చాన్స్ వస్తే సింహంతో పోటీకి రెడీ అన్నట్లుగానే ఎంతో ధైర్యంగా నిలబడటమే కాదు సింహం పైకి అరవడం కూడా మొదలు పెట్టింది ఆ కుక్క.. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త అందర్నీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: