సాధారణంగా తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధం కంటే తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. కూతురిని ఎంతో అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు తండ్రి అని ఎన్నోసార్లు నిరూపితమైంది.. అదే సమయంలో అటు కూతురు కూడా తన తండ్రి విషయంలో వెల కట్టలేని ప్రేమను చూపిస్తూ ఉంటుంది. తండ్రికి ఏ చిన్న అపాయం కలిగిన కూడా అస్సలు తట్టుకోలేదు కూతురు. సాధారణంగా తండ్రికి ఏదైనా జరిగినప్పుడు కూతుర్లు ఎంతో బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కూతురు మాత్రం తన తండ్రి పై ఒక వ్యక్తి చేయి చేసుకున్నాడు అనే విషయం తెలిసి ఉగ్రరూపం చూపించింది. బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం కాదు అపరకాళిగా మారిపోయింది ఆ యువతి.


 ఒక వ్యక్తి తన తండ్రిని  కొట్టడాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోయింది. వెంటనే చేతిలో కర్ర పట్టుకుని ఆవేశంగా వెళ్లి తండ్రి పై చేయి చేసుకున్న వ్యక్తిని చితకబాదింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.తండ్రిని ఒక వ్యక్తి కొట్టాడు అనే కారణంతో కూతురు ఉగ్రరూపం దాల్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శివపురి లోని దినారా పట్టణంలోని ఓ దుకాణదారుడు వృద్ధుడిపై  దాడి చేశాడు. ఇక ఈ విషయం కూతురికి తెలిసింది. అయితే తన తండ్రి పై షాప్ కీపర్ దాడి చేయడాన్ని జీర్ణించుకోలేక పోయింది ఆ కూతురు. తండ్రి వద్దు వద్దు అని ఎంత బతిమిలాడినా కర్ర చేతపట్టుకుని దుకాణదారుడు దగ్గరికి వెళ్ళింది. మా నాన్న ని ఎందుకు కొట్టావ్ అంటూ ప్రశ్నించింది. దుకాణదారుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చేతిలో ఉన్న కర్ర తో దారుణంగా చితకబాదింది.



 అక్కడ ఉన్న స్థానికులు అందరూ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. తండ్రిపై కూతురు చూపించిన ప్రేమకు అందరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ భయపడకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన యువతి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే టీ షాప్ లో టీ తాగి ఐదు రూపాయలు ఇచ్చినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని యజమాని వృద్ధుడిపై చేయి చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: