ఎంతో మందిని ఆకర్షించింది ఇక రికార్డుల మోత మోగించాయి. ఇటీవలే పుష్ప సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్కు కూడా అన్ని భాషల ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచింది. అయితే ఈ సినిమాలో సమంత ఏకంగా ఒక ఐటమ్ సాంగ్ చేయడం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఊ అంటావా ఊహు అంటావా మావ అంటూ సాగిపోయే పాట ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తుంది. తక్కువ సమయంలోనే ఈ పాట అందరికీ కనెక్ట్ అయిపోయింది.
అయితే ఈ పాటలో మగవాళ్ల బుద్ధి వంకర బుద్ధి అంటూ లిరిక్స్ ఉంటాయి. దీనికి పురుషుల సంఘం ఏకంగా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పురుషుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ పాట ఉంది అంటూ తెలిపారు. అయితే సినిమాలోని ఊ అంటావా ఊహు అంటావా అనే పాట ఒకవేళ అబ్బాయిలు పాడితే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందో ఇక్కడ ఒక నెటిజన్ పాడి చూపించాడు. పాటలో అబ్బాయిలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయన్న కోపమో ఇంకేదైనా కారణమో తెలియదు కానీ ఇక ఈ పాటలోని లిరిక్స్ అన్నింటినీ మార్చి ఇక తనదైన శైలిలో పాడి సినిమాలోని వీడియో లను జత చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి