నిత్యం ఎంతో మంది బ్యాంకులకు సంబంధించి లావాదేవీలు ఏదో ఒక విషయంలో జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా బ్యాంకులకు హాజరవుతూ డబ్బులు కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడం లేదా లావాదేవీలు జరపడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి ముఖ్యమైన లావాదేవీలు జరిపేటప్పుడు బ్యాంకులకు ఏ రోజున సెలవు ఉంటుంది అనే విషయాలను కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాలి.. అంతేకాదు నెలలో ఆ బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి .. ఏ ఏ రోజులు సెలవులు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే బ్యాంకుకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది..

ఇక ఊహించని విధంగా ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజుల పాటు సెలవులు రానుండడంతో ఖాతాదారులు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు.. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో రెండవ నాలుగవ శనివారాలు, ఆదివారాలు  ఉన్నాయి . ఇక అంతే కాదు ఫిబ్రవరి నెలలో పండుగలు కూడా రాబోతున్నాయి.. అదేమిటంటే బసంత్ పంచమి, గురు రవిదాస్ జయంతి నాడు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందుకే ఫిబ్రవరి నెలలో దేశంలో ఉన్న ప్రతి బ్యాంకు కూడా ఏకంగా 12 రోజుల పాటు సెలవులు తీసుకోనున్నారు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు, నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి.

ఇకపోతే ఏ ఏ రోజు సెలవు వచ్చింది అనే విషయానికి వస్తే.. ఫిబ్రవరి 2 - సోనమ్ లోచర్ , ఫిబ్రవరి 5 -  బసంత్ పంచమి, సరస్వతి పూజ, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీలు ఆదివారాలు కాగా, ఫిబ్రవరి 12 రెండవ శనివారం 26 నాలుగవ శనివారం బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ మహమ్మద్ హజ్రత్ అలీ బర్త్ డే , ఫిబ్రవరి 16 గురు రవిదాస్ జయంతి, ఫిబ్రవరి 18 డోల్జాత్రా, ఫిబ్రవరి e19 చత్రపతి శివాజీ మహరాజు జయంతి ఇక ఇలా పన్నెండు రోజులపాటు ఫిబ్రవరి నెలలో.. బ్యాంకులు మూతపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: