ప్రమాదం ఎప్పుడూ ఎటువైపు నుంచి ముంచుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఇక ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా క్షణాల వ్యవధిలో అప్రమత్తమై ఎవరినైనా ప్రమాదం  నుంచి కాపాడితే ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రమాదవశాత్తు టెర్రస్ పైనుంచి పడుతున్న తమ్ముడిని అన్నా ఎంతో సమయస్ఫూర్తితో క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఎలాంటి గాయాలు కాకుండానే టెర్రస్ పైనుంచి పడిన తమ్ముడు బయట పడ్డాడు అని చెప్పాలి. అయితే ఈ ఘటనలో అన్న తలకు మాత్రం స్వల్ప గాయం కావడం గమనార్హం. ఈ ఘటన కేరళలోని మల్లాపురం లో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో  సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఇది కాస్త ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో లో భాగంగా అన్నదమ్ములు తమ ఇంటిని శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నయ్య ఇంటి ముందు నిలబడి పైప్ తో వాటర్ పడుతూ ఉండగా తమ్ముడు టెర్రస్ పైన శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పట్టు తప్పాడు తమ్ముడు. తలకిందులుగా కిందకి పడిపోబోయాడు. అయితే ఇది గమనించిన అన్న వెంటనే అప్రమత్తమయ్యారడు. చేతిలో ఉన్న పైపు వదిలేసి రెండు చేతులతో తమ్ముడిని క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వారిద్దరు కూడా కిందపడిపోయారు. అయితే తమ్ముడికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అన్న తల నేలకు తగిలింది. దీంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ వీడియో చూసి అన్న సమయస్ఫూర్తికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: