ఒకప్పుడు భూమిని అమ్ముతారు అంటే నవ్వుకున్నారు. కానీ భూమి కోసం ఎంతోమంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి కొంటున్నారు. అంతే కాదు ఒకప్పుడు నీటిని అమ్ముతారు అని అన్నా కూడా ఎవరూ నమ్మలేదు. కానీ ప్రస్తుతం నీటిని బిస్లరీ వాటర్ అంటూ బాటిల్ లలో నింపి మరి ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. ఇక ఒకప్పుడు నీటిని అమ్ముతారు అంటే నమ్మలేము అన్న వారే బాటిల్ లను కొంటూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో గాలిని కూడా అమ్ముతారు అంటే అదెలా సాధ్యమవుతుంది అని అందరూ అనుకున్నారు.
ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా గాలినీ అమ్ముతు క్యాష్ చేసుకుంటున్నాడు. ఇది చూస్తూ ఉంటే అందరికీ భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తుంది అని చెప్పాలి. కొలంబియాలోని వీధిలో గాలిని అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ వ్యక్తి. అయితే కొంతమంది అతని ఆలోచనను వ్యతిరేకిస్తున్న అతని వద్ద గాలిని కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. కొలంబియాలో వాతావరణం మంచిగానే ఉంటుంది. కానీ స్వచ్ఛమైన గాలిని బాటిళ్లలో నింపుకొని రోడ్లమీద తిరుగుతున్నాడు. ఇక ప్రతి బాటిల్ లో ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైనగాలి ఉంటుందని అమ్ముతున్న వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఒక బాటిల్ ఐదు డాలర్లు కాగా ఇండియన్ కరెన్సీ లో 400 రూపాయలు. అయినా జనాలు ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇక అతని తెలివికి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి