పానీపూరి పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ..ఆ రుచి అలాంటిది మరి.. పానీపూరి బండి దగ్గర వెయిట్ చేసి తినాలి..అలా కాకుండా ఆర్డర్ చేసిన క్షణాల్లో పానీపూరి మన ముందుకు వస్తే ఇక ఎన్ని తిన్నమో తెలియకుండా తింటాము.. సెన్సార్ పానీపూరి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోవాలి..ఈ అన్నదమ్ములు తమకు తెలిసిన చిరు వ్యాపారం లోనే కొత్తదనాన్ని జోడించి దూసుకుపోతున్నారు. తెలంగాణ  లోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లక్ష్మణ్, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. సంతోష్ హోటల్ మానేజ్మెంట్ చేయగా, లక్ష్మణ్ పీజీ ఫైనాన్స్ చేశాడు.



హోటల్ మానేజ్మెంట్ చేసిన సంతోష్ కొంతకాలం ముంబై లోని ఓ హోటల్‌లో పనిచేశాడు. లక్ష్మణ్ సైతం ఉద్యోగ ప్రయత్నం చేయగా పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్నారు. ముంబైలోనే పానీపూరి, చాట్ దుకాణం పెట్టారు. అలా ముంబై లో అప్పుడపుడే వ్యాపారం లో నిలదొక్కుకుంటుండగా కరోనా లాక్‌డౌన్‌ తో ఒక్కసారిగా వీరి జీవితం తలకిందులైంది. దీంతో సొంత ఊరి గోదావరిఖని చేరుకున్నారు.



తక్కువ పెట్టుబడి తో గోదావరిఖని లోనే పానీపూరి, చాట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వచ్చిన కస్టమర్స్‌ని ఎక్కువ సమయం వెయిట్ చేయించకుండా త్వరత్వరగా సర్వ్ చేసేలా సెన్సార్‌తో కూడిన పానీపూరి మెషిన్ పెట్టారు. పానీపూరి ఆర్డర్ చేసిన వెంటనే పూరీలో బఠాణీ పప్పు పెట్టి ఇస్తారు.ఆ పూరీని అక్కడే ఉన్న చిన్న పైప్ వద్దకు తీసుకెళ్తే.. సెన్సార్ డిస్పెన్సర్ ద్వారా పానీ వచ్చి పూరీలో పడుతుంది. దీంతో ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నా త్వరగా సర్వ్ చేస్తుండడం తో ఫుడ్ లవర్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు.. దానిని చూడటానికి కూడా ఎక్కువ మంది వచ్చి రుచి చూసి వెళ్తున్నారు. మొత్తానికి ఫెమస్ అయ్యారు..అటు వెళితే మీరు అక్కడి పానీపూరి టెస్ట్ చెయ్యడం మర్చిపొకండి..



మరింత సమాచారం తెలుసుకోండి: