సాధారణంగా కుక్కలను కేవలం పెంపుడు జంతువులుగా మాత్రమే పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది ప్రేమగా కుక్కలను తెచ్చుకుని ఇంట్లో మనిషిలాగ చూసుకోవడం లాంటివి కూడా నేటి రోజుల్లో జరుగుతుంది. కానీ శునకాలు అంటే కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు దేశానికి రక్షణగా నిలిచే సైనికులు కూడా అన్న విషయం ఇటీవల కాలంలో నిజం చేసి చూపిస్తున్నాయి ఎన్నో శునకాలు. ఏకంగా భారత ఆర్మీలో  సైనికులతో పాటే శునకాలు కూడా శత్రువులతో  పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలా దేశ సరిహద్దుల్లో ఇటీవల కాలంలో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న శునకాలు  సైనికులకు ఎక్కడ తక్కువ కాకుండా శత్రువులను వణికిస్తూ పోరాటం సాగిస్తున్నాయి అని చెప్పాలి. దీనిబట్టి చూస్తే ఇక మనుషుల్లో కంటే శునకాలలోనే కాస్త దేశభక్తి ఎక్కువగా ఉందేమో అని కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి దేశభక్తి కలిగిన ఒక శునకానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ప్రస్తుతం నేటిజన్స్ అందరినీ కూడా ఫిదా చేసేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. తల్లి, మాతృభూమి అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది  దేశంపై ఉన్న ప్రేమను భిన్న రకాలుగా చాటుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక శునకం కూడా తనకు వచ్చిన శైలిలోనే దేశభక్తిని చాటుకుంది. వివిధ దేశాలకు చెందిన మ్యాప్ ను ఒక బోర్డు పై పెట్టి కుక్కను ఇక భారత మ్యాప్ ను గుర్తించాలి అంటూ అక్కడికి వదిలారు. అయితే ఇక సరిగ్గా భారత మ్యాప్ దగ్గరికి వెళ్లిన ఆ శునకం ఆ మ్యాప్ దగ్గర కూర్చుని రెండు కాళ్లు ఎత్తి భారత మాతకు నివాళులర్పించింది అని చెప్పాలి. ఇక ఆ కుక్క దేశభక్తి చూసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: