ఈ జనరేషన్ పిల్లలకు ఉండే తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈ వయసులో మేము ఆడుకునే వాళ్ళం.. కానీ ఈ జనరేషన్ పిల్లలు చూడండి ఏకంగా రికార్డులు కొల్లగొడుతున్నారూ. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు అంటూ నిన్నటి తనం జనరేషన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే స్కూల్ దశ నుంచే ఇక మల్టీ టాలెంట్ కలిగి ఉంటున్నారు నేటి రోజుల్లో పిల్లలు. అంతేకాదు చిన్నప్పుడే సోషల్ మీడియాలో పాపులర్ గా  కూడా మారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 అయితే మార్కుల విషయంలోనే కాదు ఇక తల్లిదండ్రులు తమ విషయంలో స్కూల్లో ఏం మాట్లాడాలి అనే విషయాన్ని కూడా పిల్లలే డిసైడ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఒకప్పుడు మార్కులు తక్కువగా వచ్చాయి అంటే.. ప్రోగ్రెస్ కార్డులో మార్కులను మార్చడం లేదంటే తండ్రి సంతకాన్ని విద్యార్థులే పెట్టి తండ్రికి  తెలియకుండా ఇక స్కూల్లో సబ్మిట్ చేయడం చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం ఒక అబ్బాయి అలా చేయట్లేదు. స్కూల్లో టీచర్ తో తన గురించి ఏం మాట్లాడాలో కూడా తండ్రికి ట్రైనింగ్ ఇస్తున్నాడు.


 ఇక ఇది ట్రైనింగ్ ఇవ్వడం అనడం కంటే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. సాధారణంగా పేరెంట్స్ మీటింగ్ లను నిర్వహిస్తూ ఉంటారు టీచర్లు. అయితే ఇలా పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళేటప్పుడు అక్కడ తన గురించి ఏం మాట్లాడాలో అన్న విషయంపై తన తండ్రికి చిన్నపాటి జ్ఞాన బోధ చేశాడు  ఇక్కడ ఒక పిల్లాడు. ముద్దు ముద్దుగా ఎంతో వినయంగా టీచర్కు ఏం చెప్పకూడదో క్లుప్తంగా వివరించాడు. ఒకవేళ ఏదైనా సందర్భంలో అబద్ధం చెప్పాల్సి వస్తే చెప్పు కానీ తిట్టకూడదని కూడా చెబుతూ ఉన్నాడు. ఇలా అతను ఎంతో క్యూట్ గా మాట్లాడుతున్న మాటలు మాత్రం నేటిజన్స్ అందరినీ ఫీదా చేసేస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: