
స్కిల్ డెవలప్మెంట్ స్కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం చేత తన కుటుంబ సభ్యులకు కూడా మొదటిసారి ప్రజలలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలో అక్టోబర్ 5వ తేదీ నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక బాలకృష్ణ కూడా తన బావ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో గత కొద్ది రోజులుగా టిడిపి ఇన్చార్జిగా ఉంటూ పలు వాటిని అమలు చేస్తూ ఉన్నారు అయితే ఈసారి బాలకృష్ణ పరామర్శ యాత్ర అనే వాటితో ప్రజలలోకి వెళ్లడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా యువగళం పేరిట పాదయాత్రను మొదలుపెట్టి చాలా కాలం అవుతోంది. ఇక ఈయన భార్య నారా బ్రాహ్మణి కూడా యువగళం లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక్క జగన్ ను ఓడించడానికి ఇంతమంది ఏకం కావడం చూసి పలువురు ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు మాత్రం ఈసారి కూడా వైసీపీ పార్టీకి అధికారం కట్టేలా ఉన్నట్లు పలు రకాల సర్వేలతో పాటు పలువురు నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు పనులు ప్రజలకు బాగా చేరువతో ఉండడంతో ప్రతిపక్ష పార్టీలను పెద్దగా పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.