అయితే ఈ సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని అందరిని నవ్విస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. మరికొన్ని కళ్ళతో చూసేది కూడా నమ్మలేని విధంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా గుర్భ డాన్స్ గురించి దాదాపు ఇండియన్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ కూడా గర్బా డాన్స్ చేస్తున్నారు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. ఏకంగా మనుషులే కాదు దయ్యాలు కూడా ఇక్కడ గుర్బా డాన్స్ చేస్తూ ఉన్నాయి.
ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ కొంతమంది షాక్ అవుతుంటే ఇంకొంతమంది మాత్రం కడుపుబ్బాని నవ్వుకుంటున్నారు. అందరూ రకరకాల డ్రెస్సుల్లో డాన్స్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం భయంకరమైన దయ్యాలుగా తయారై డాన్స్ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న వ్యక్తులతో ఉత్సాహంగా నృత్యం చేస్తున్న నన్ పాత్రలో ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ కూడా అసాధారణ రీతిలో గుర్బ డాన్స్ చేస్తూ ఉన్నారు. గుర్బ అనేది దుర్గాదేవి చుట్టూ నృత్యం చేయడానికి మరియు సంతోష పెట్టడానికి ఒక వేడుక. కానీ అక్కడ మాత్రం ఏకంగా దుర్గాదేవిని అగౌర పరిచే విధంగా వాళ్ళు డాన్స్ చేస్తున్నారని కొంతమంది నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి