ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతూ ఉన్నాయ్. దీంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే అందరూ భయపడిపోతున్నారు. అయితే మధ్యాహ్న సమయంలోనే కాదు ఉదయం సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఇక మధ్యాహ్నం ఎంత అత్యవసరమైన పని ఉన్నప్పటికీ ఇక దానిని సాయంత్రం చేసుకుందాంలే అని కోరుకుంటున్నారు తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లడానికి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. అదే సమయంలో ఇక ఎండ తాపం నుంచి తట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


 ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని ఉండి ఎవరైనా మధ్యాహ్నం సమయంలో రోడ్డుపైకి వచ్చారు అంటే ఇక ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు తమతో పాటు గొడుగులను తీసుకొచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ గొడుగులతో కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి మధ్యాహ్నం సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఎండ వేడిని తట్టుకునేందుకు ఉపశమనం పొందేలా సదరు వ్యక్తి చేసిన పని కాస్త అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎంత ఎండ ఉంటే మాత్రం ఎవరైనా ఇలా చేస్తారా అని నెటిజెన్స్  కూడా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇంతలా చర్చ జరుగుతుంది అంటే సదరు వ్యక్తి ఏదో విచిత్రమైన పని చేసే ఉంటాడు అనిపిస్తుంది కదా. నిజమే అతను చేసింది అలాంటి పనే. కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ విదేశీయుడు మిట్ట మధ్యాహ్నం రోడ్డుపైకి వస్తాడు. అప్పటికే విపరీతమైన ఎండ ఉండడంతో అతను భరించలేక పోతాడు. అయితే ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ముందే అతని వెంట ఒక పెద్ద ఐస్ గడ్డను తెచ్చుకుని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దానిని తోసుకుంటూ వెళ్లడమే కాదు.. ఇక కాస్త ఉపశమనం కోసం మధ్య మధ్యలో ఆగుతూ ఐస్ గడ్డపై కూర్చొని సేద తీరుతుంటాడు. అయితే అతని ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: