మన జీవితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కనిపించిన దారిని బట్టి మనము వెళుతూ ఉండాలి. దారిలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులను అయినా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి తన మనసులో ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా ఒక సారి సంతోషంగా, ఒకసారి బాధగా, ద్వేషంగా....ఇలా సందర్భాన్ని బట్టి పలు రకాల భావోద్వేగాలతో మన చేతిలో ఉన్న కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. వాస్తవానికి సమయాన్ని సరైన పద్దతిలో వాడుకునే వారే అసలైన గెలుపుని ఆస్వాదించగలరు. అలా కాకుండా కాలక్షేపం చేస్తూ సమయం వృధా చేసే వారు ఓటమిని తప్ప మరొకటి చూడలేరు.

సమయం విలువ తెలుసుకుని సద్వినియోగ పరుచుకునే వారే ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారే విజయాన్ని అందుకోవడానికి అర్హులు కాగలరు.  అలాగే ఉన్నచోటే కూర్చొని ద్యానం చేస్తూ నాకు విజయం దక్కలేదు, మార్గం కనబడటం లేదు అంటే సరికాదు. కొన్ని సందర్భాలలో సమయాభావము పాటించక పోవడం వలన కొన్ని అద్భుతమైన అవకాశాలను చేజార్చుకోవచ్చు. అందుకే సమయాన్ని బేఖాతరు చేయకండి. గడిచిన ఏ నిమిషము మళ్ళీ తిరిగి రాదు.  లా కాకుండా స్థిరమైన నిర్ణయం తీసుకొని  ముందుకు సాగితే విజయానికి దారి దానికదే ఏర్పడుతుంది.


సమయ స్ఫూర్తి, శ్రమించే గుణం ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రయత్నించు.. ప్రయత్నిస్తూనే ఉండు విజయం నీకు సొంతం అవ్వక తప్పదు. ఇంత వరకు కాల యాపన చేసింది చాలు. ఇక లేచి నీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి ప్రతి నిముషం కష్టపడు. ఇక మీ లక్ష్యాన్ని అందుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకోండి. ఈ విధంగా సమయం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇలా పైన చెప్పిన విషయాలను అనుసరించి విజయానికి చేరువ కండి.  అనుకున్నది జరగాలంటే ఈ నియమం పాటించడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: