ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం లోకి ఒంటరి గానే వస్తారు. వెళ్లే ముందు ఒంటరి గానే వెళ్ళిపోతారు. మనము వచ్చే ముందు ఇదే తీసుకు రాము. అలాగే వెళ్లే ముందు ఏమీ తీసుకుపోలేము. కాబట్టి ఈ మధ్యన మన జీవితంలో జరిగేది అంతా ఒక మాయ అని చెప్పాలి. ఆ దేవుడు మానవునితో ఆడించే ఒక మాయ. ఇది తెలియని చాలా మంది ఈ ప్రపంచంలో అన్నింటి కోసం పోరాడుతూ ఉంటారు. ఇక్కడ మనము పొందే ఏదీ శాశ్వతం కాదు. ఉన్న ఈ తాత్కాలిక జీవితంలో కొంచెం మీ కోసం నిలబడే మీ వెంట ఉండే మనుషులను పొందడానికి ప్రయత్నించండి. మీరు రేపు చనిపోయినా మీ పేరు ఈ భూమి మీద పది కళల పాటు చెప్పుకునేలా మీ జీవితాన్ని జీవించండి. ఒక మనిషిగా అంతకన్నా ఏమీ అవసరం లేదు.

అలా మీ పేరు కలకాలం నిలిచిపోయేలా బ్రతకాలంటే మీరేమి చేయాలో ఇప్పుడు చూద్దాం.

* మీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవంగా చుడండి. వారిపైన ప్రేమ చూపించండి. రేపు అదే మిమల్ని వారి మనసులో ఒక మంచి మనిషిగా నిలిచేలా చేస్తుంది.

* ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలిసో తెలియకో ఎవ్వరికీ చెడు చేయకండి. మీరు చేస్తున్న చెడు ఏదో ఒకప్పుడు మిమ్మల్నే కాటేసే పరిస్థితి రావొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

* మీకు వీలున్నంత వరకు ఎదుటి వారికి సహాయం చేయండి. ఈ రోజు మీరు చేసిన సాయమే, రేపు మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.

* మన జీవితంలో ఎంతో కొంత మంచి చేసి..కాస్త పుణ్యాన్ని సంపాదించుకోవడం ముఖ్యం.

* సాధారణంగా చాలా మందికి స్వార్ధం అనే గుణం ఉంటుంది. ఇది ఉంటే మీ నుండి మనుషులను దూరం చేస్తుంది. కాబట్టి ఈ గుణాన్ని త్యజించండి.

పై విధంగా ఈ విషయాలను మీ జీవితాల్లో భాగంగా గుర్తుంచుకుని పాటిస్తే చనిపోయాక కూడా మిమ్మల్ని గుర్తించుకుంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: