దేవుడు సృష్టించిన కమ్మని పదం అమ్మ..దేవుడు మనకిచ్చిన  కమ్మని బంధం అమ్మ.ప్రాణం పోయే స్థితి లో కూడా మరో ప్రాణికి జన్మనిచ్చేదిఅమ్మ. పురిటి నొప్పులని సైతం హాయిగా భరించేది మన తల్లి.కడుపులో ఉన్నపుడు అమ్మ పొట్ట మీద మనం కాళ్ళతో కొడుతూ ఉంటాము. కానీ మనం కొట్టినా  గాని అమ్మ ప్రేమతో తడిసి ముద్దవుతుంది.పుట్టాక మనల్ని చూసుకుని మురిసిపోతుంది. ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించేది ఒక్క అమ్మ మాత్రమే.. పుట్టే బిడ్డ ఎలా ఉన్నాగాని తన బిడ్డే అందరికంటే అందంగా ఉన్నాడని మురిసిపోతుంది.

 

పుట్టేది ఆడపిల్ల, మగపిల్లాడ అనే తేడా అమ్మకి ఉండదు. ఎందుకంటే పేగు బంధం.. మనం తెంచుకోవాలన్న తెగని బంధం అది.. పిల్లలం మనం మరిచిపోయిన అమ్మ మర్చిపోదు ఎందుకంటే నవ మాసాలు మోసి పేగు తెంచుకుని  మరి మనకి జన్మ నిచ్చింది కాబట్టి. మనకు గోరుముద్దలు పెట్టి, తన స్థనాన్ని మనకి పంచింది అమ్మ.  తప్పటడగులు నేర్పింది అమ్మ, తప్పులు సరిదిద్దేది అమ్మ మనకి తప్పఆ దేవుడికి కూడా  వెలకట్టలేని గొప్ప అనుబంధం అమ్మ..అలాంటి అమ్మను కనిపించే దైవంగా పూజిద్దాం.. కనిపెంచే బంధంగా ఆరాధిద్దాం. అమ్మ మనకిచదువు చెప్పే టీచర్.నిద్ర పుచ్చెట్టప్పుడు సింగర్.

 

జ్వరం వచ్చినపుడు డాక్టర్.తప్పు చేసినపుడు పోలీస్..దారి చూపే అడ్వైసర్.బోర్ కొడితే అడ్వెంచర్.అమ్మ గూర్చి ఎంత చేసిన తక్కువే, ఎంత మాట్లాడిన తక్కువే. మనకు ఈ జన్మంటూ ఉందంటే అది కేవలం మన అమ్మ వల్లే.. అమ్మకి మనం పిలిచే పిలుపు కావాలి తప్ప మన నుంచి ఆస్తులో లేక డబ్బో, నగలో కాదు.  ఇప్పటికి కొడుకు కష్టంలో ఉన్నాడని తెలిస్తే తన గుండె అల్లాడిపోతోంది.  ఆమ్మో నా బిడ్డ కష్టంలో ఉన్నాడని ఏదన్నా చేయాలనీ పరితపించిపోతుంది. కానీ మనం అమ్మ కష్టంలో ఉంటే మాత్రం గాలికి వదిలేస్తున్నాం. పట్టెడు అన్నం పెట్టలేక పోతున్నాము మన మాతృమూర్తికి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: