అందంగా ఉండాలని ఎవరికీ మాత్రం అనిపించదు చెప్పండి. అందం అంటే చాలు ఆడవాళ్లు ముందు ఉంటారు.అందంగా ఉండాలని అనుకునే వారు వారి చర్మ సంరక్షణ విషయంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తారు.ఎంత శ్రద్ద వహించిన గాని చర్మం అనేది ఎదో ఒక సమస్యకు గురి అవుతూనే ఉంటుంది. మనం  చిన్నతనంలో ఉన్నప్పుడు మన ముఖ చర్మం మీద ఎటువంటి మచ్చలు లేదా బొబ్బలు లేకుండా చాలా మృదువుగా, కాంతివంతగా,  అందంగా కనిపిస్తుంది. కానీ అంతకుముందులాగానే ముఖం అందంగా ఉండాలని కోరుకుంటే అది సాధ్యం కాని  పని. ఎందుకంటే ఆడపిల్లలకు యుక్తవయస్సు వచ్చిన  కొద్ది రోజుల తరువాత ముఖం మీద మొటిమలు, వస్తాయి. అవి కొన్ని రోజుల తర్వాత  కనుమరుగవుతాయి. కానీ వాటి తాలూకు మచ్చలు  మాత్రం అలానే ఉంటాయి. అయితే యుక్తవయస్సు మాత్రమే ముఖం యొక్క అందాన్ని నాశనం చేయటానికి దారితీస్తుందని అనుకోకూడదు. మన జీవన విధానం, మన ఆహార శైలి, మన మానసిక ఆలోచనలు, మన శరీర తత్త్వంను బట్టి మారతాయి.

అందుకనే ముఖం మీద మొటిమలు, మచ్చలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు వారి రోజువారీ ఆహారపు అలవాట్లపై చాలా శ్రద్ధ వహించాలి.బాగా నూనెలో  వేయించిన ఆహారాలు, స్ట్రీట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు మొదలైనవి అసలు తినకూడదు. అనారోగ్యకరమైన కొన్ని ఆహారాలను తినడం తగ్గించాలి. అసలు ఆడవాళ్లు అందాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, వేటికి దూరంగా ఉండాలి అన్న విషయాల్ని తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని తినకూడదు అని అందరూ అంటారు. కానీ  ఇది తప్పు. ఎందుకంటే  ఆడవాళ్లు చక్కెరకు చాలా  త్వరగా ప్రభావితం అవుతారు. ఎందుకంటే చెక్కరలో ఉంటే స్వీట్ నెస్ వల్ల. కానీ చెక్కర శాతం అనేది మన శరీరంలో ఎంత తక్కువ ఉంటే అంతా మంచిది అంట.  కాబట్టి మీరు చాలా తక్కువ మొత్తంలో పంచదార వేసుకుని  ప్రతిరోజూ కాఫీ లేదా టీ తాగండి.. అసలు సాధ్యమైనంత వరకు టీ, కాఫీ తాగడం మానేస్తే ఇంకా మంచిది. మీరు తినే తీపి ఆహారాలను కూడా తగ్గించుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: