ఆడవాళ్లు చర్మ సంరక్షణ కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖానికి ఏవేవో రాస్తూ ఉంటారు. బయట దొరికే కెమికల్స్ కలిపిన క్రీమ్స్ రాసుకునే బదులు ఇంట్లో దోరికే పదార్ధాలతో సహజంగా మీ చర్మాన్ని కాంతివంతం చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బయట దోరికే క్రీమ్స్, మేకప్, లోషన్స్ ముఖానికి రాసుకున్న వెంటనే చర్మం నిగనిగలాడుతుంది. కొని ఆ మార్పు శాశ్వతం కాదు. తాత్కాలికం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అలాగే సహజ సిద్ద పదార్ధాలతో పాటించే టిప్స్ అప్పటికప్పుడు ఫలితం చూయించకపోయిన నెమ్మదిగా మార్పు వస్తుంది.. కానీ క్రమం తప్పకుండ మీరు చేస్తూ ఉంటేనే మీ చర్మం మంచిగా ఉంటుంది..మీ ముఖాన్ని కాంతివంతగా మెరిపించడానికి బేకింగ్ సోడాతో కొన్ని టిప్స్ చూద్దాం.. !!
బేకింగ్ సోడాని వంటల్లో మాత్రమే వాడడం కాదు. అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. మీ చర్మం లోని అందం దూరమైతే, కాంతివంతం కోసం చిట్కా కావాలంటే, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా,అలాగే 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే సరి. మలినాలతో పూడిపొయిన మీ చర్మ రంద్రాలని శుభ్రం చేసి సహజత్వం లేని మీ చర్మాన్ని ఎంతో కాతివంతంగా, మృదువుగా చేస్తుంది.
బేకింగ్ సోడాని మీరు స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి, కొత్త కణాలు వస్తాయి, అవి మీ శరీరంలో దుర్వాసనను నశింపజేసి ,శరీరాన్ని తాజాగా ఉంచ్చుతుంది. నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి