టైటానిక్ సినిమాలో బొమ్మలు వేసుకునే జాక్ ని రోస్ ఇష్ట పడినట్టు స్వీడన్ కు చెందిన చార్లెట్ ఢిల్లీ వీధుల్లో బొమ్మలు వేసుకునే మహానందియా అనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరురాలు అయిన ఆమె ఇండియా లో పర్యటిస్తున్న సమయంలో ఒకరోజు మహానందియా వద్దకు వచ్చి తన బొమ్మను గీయించుకుంది. అయితే ఆ బొమ్మ తనకు నచ్చలేదని మహానందియా తో చెప్పి ఆమె వెళ్ళిపోయింది. తాను గీసిన బొమ్మ నచ్చలేదని ఆమె చెప్పడంతో మహానందియా తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆమె ఇంకొక బొమ్మ గీసాడు కానీ అది కూడా చార్లెట్ కి నచ్చలేదు. కానీ ఈ సారి బాగా గీయడంతో మహానందియా కి ఆమె పది రూపాయలు ఇచ్చింది.

1975 వ కాలంలో 10 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. నిజానికి బొమ్మ గిస్తే 1 రూపాయి ఇవ్వడమే గగనం. అయితే చార్లెట్ తనకు 10 రూపాయలు ఇవ్వడంతో మహానందియా కొంచెం సంతోషపడ్డాడు కానీ ఆమెను మెప్పించ లేదనే అసంతృప్తితో ఉండిపోయాడు. అప్పుడే తాను తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఖర్చుపెట్టి రంగురంగుల స్కెచ్ లు కొని మళ్లీ చార్లెట్ ని బతిమిలాడి ఆమె బొమ్మ గీశాడు. ఈ సారి కలర్ ఫోటో కంటే బ్రహ్మాండంగా బొమ్మ రావడంతో చార్లెట్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఆమె మహానందియా వద్దకు వచ్చి తమ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము అని.. ఎక్కడికి వెళితే బాగుంటుంది చెప్పాలని కోరింది. అప్పుడు ఆయన ఒరిస్సా లో కోణార్క్ టెంపుల్ కి వెళితే బాగుంటుంది అని చెబుతాడు.

అయితే మహానందియా పుట్టి పెరిగిన ఊరిలోనే కోణార్క్ టెంపుల్ ఉంది. దీంతో చార్లెట్ ఆయన ఇంటికి కూడా వెళుతుంది. అప్పుడే ఆమె ఆయన తల్లిదండ్రులను కలిసి మహానందియా అంటే తనకు ఇష్టమని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెబుతోంది. దీనితో తల్లిదండ్రులు కూడా సంతోషించి పెళ్లికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత చార్లెట్ చదువు విషయమై తన స్వదేశానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మహానందియా ఒక బైక్ కొని ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆమెను చేరుకుంటాడు. దీంతో ఆయన తన మీద ప్రేమతో తన దగ్గరకు వచ్చాడు అని ఎంతో సంతోషించి ఆయనతోనే కలిసి ఉంటుంది. ఇప్పుడు వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: