మీకు తెలుసా దేశంలోనే తొలి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరని? ఆమె ఇంటర్వ్యూ కి వెళ్లిన క్రమంలో అక్కడున్న ఒక అధికారి తనకి ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ఏమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.మొదటి మహిళ కేరళ నుండి రావడం తోనే అర్థం అవుతుంది కేరళ రాష్ట్రం అప్పటినుంచే అక్షరాస్యతలో ముందు వరుసలో ఉందని.
దేశంలోనే తొలి మహిళ ఆఫీసర్ అన్నా రాజాం మల్హోత్రా. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన మహిళా. కేరళలోని నిరానం అనే చిన్న విలేజ్ లో పుట్టిన మహిళా దేశం గర్వించదగ్గ తొలి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పదవిని చేపట్టింది. రాజాం 1950 లో సివిల్స్ పరీక్షా రాసి ఐఏఎస్ కి ఉతీర్ణత సాధించింది.
అయితే రాజాం కి సివిల్స్ ఇంటర్వ్యూ జరిగే సమయంలో అక్కడి ఒక UPSC బోర్డు కి చెందిన ఒక అధికారి రాజాం ను ఐఎఫ్ఎస్(IFS ) తీసుకొమ్మని సలహా ఇచ్చారట. కలెక్టర్ ఉద్యోగం చాలా కష్టంగా ఉంటుందని మహిళలు ఈ ఉద్యోగాన్ని చేయలేరు అని అయన చెప్పడంతో రాజాం మల్హోత్రా పట్టువదలకుండా ఐఏఎస్ లో జాయిన్ అయ్యారు. మొదటి పోస్ట్ కింద తమిళనాడు లో పనిచేసారు.చిరుపుత్తూర్ సబ్ కలెక్టర్ గా రాజాం మొదటి ఛార్జ్ తీసుకున్నారు. ఆ విధంగా మొత్తంగా తన పదవి కాలంలో ఎక్కువ మంది ముఖ్యమంత్రుల కింద రాజాం మల్హోత్రా పనిచేసారు.అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఆమె పనిచేసారు.
రాజాం దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించింది. అయితే రాజాం మల్హోత్రా R.N మల్హోత్రా ను వివాహం చేసుకుంది. R.N మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసారు. ఇతడు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినప్పుడే 500 నోట్ ని ప్రవేశపెట్టారు. అలాగే 1990 లో భారత ప్రభుత్వం R.N మల్హోత్రా కి పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి