ఈ లోకంలోకి ఒక తల్లి నుండి జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే కొందరు పిల్లలు మాత్రం అంగ వైకల్యంతో లేదా తెలివి తక్కువగా పుడుతూ ఉంటారు. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా నెలలు నిండకుండా శిశువు జన్మించటం కూడా ఒక కారణమని డాక్టర్స్ చెబుతున్నారు. దీనితో నెలలు నిండకుండా ఎందుకు శిశువు జన్మిస్తుంది అన్న విషయంపై ఎన్నో పరిశోధనల అనంతరం కొన్ని విషయాలను కనుగొన్నారు. మరి అవేమిటో ఒకసారి చూసి నెలలు నిండని శిశువులు జన్మించకుండా చేయడంలో మన పాత్ర పోషిద్దాం.

మహిళ తన గర్భాన్ని దాల్చిన సమయం నుండి 37 వారములు పూర్తి కాకుండానే శిశువు కనుక జన్మిస్తే నెలలు నిండకుండా పుట్టడం అని అంటాము. ఈ లెక్క ప్రకారం చూస్తే మన దేశంలో ఒక సంవత్సరానికి 3.5 మిలియన్ల పిల్లలు నెలలు నిండకుండానే జన్మిస్తారట. అయితే ఇలా నెలలు నిండకుండా ఎందుకు బిడ్డలు జన్మిస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం.

* ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు బరువు తక్కువగా ఉన్నా ఇబ్బందే, అదే విధంగా బరువు క్కువగా ఉన్నా కూడా ఇబ్బందే... ఈ కారణం వలన తక్కువ నెలలు ఉన్న శిశువు జన్మిస్తారని తెలుస్తోంది.

* ఇక నెలలు నిండే కొద్దీ కడుపులో ఉన్న శిశువు పట్ల సరైన జాగ్రత్తలు పాటించకపోవడం... ఆహారం విషయంలో కావొచ్చు లేదా మరేతర జాగ్రత్తల విషయంలో కూడా జాగ్రత్త అవసరం.

* గర్భం దాల్చిన మహిళకు మద్యం మరియు ధూమపానం అలవాట్లు ఉన్నా కూడా నెలలు నిండని శిశువులు జన్మించే అవకాశం ఉంది.

* ఇక దీర్ఘకాలిక వ్యాధులు అయిన హై బీపీ మరియు మధుమేహం లాంటివి ఉన్న మహిళలకు నెలలు నిండకుండా శిశువు జన్మిస్తారని భోగట్టా.

* ఇక అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది మీరు అంతకు ముందే బిడ్డకు జన్మను ఇచ్చి ఉంటే, మరో బిడ్డకు కొంచెం సమయాన్ని ఇవ్వాలి. అంతే కానీ వెంటనే గర్భం దాల్చే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి.

ఇలా పైన తెలిపిన విషయాలను అర్ధం చేసుకుని నెలలు నిండని శిశువులు జన్మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: