టీవీఎస్ ఇది ఎవరికి తెలియదు.. చిన్నపిల్లాడి నుండి వృద్ధుడి వరుకు అందరికి తెలుసు.. ఎందుకంటే.. ప్రతిఒక్కరికి సంబంధించిన బందీలు ఈ టీవీఎస్ ఇప్పటికే విడుదల చేసింది. అందుకే భారత్ మార్కెట్ లో ఈ టీవీఎస్ కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పటికే ఈ టీవీఎస్ కంపెనీ చాలా వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. 

 

ఇప్పుడు అబ్బాయిలకు మరింత నచ్చే వాహనాన్ని అదే.. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వెహికల్ ని జనవరి 25 న భారత్ లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ఇదే టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310, 2017 లో భారతదేశంలో లాంచ్ చేశారు. అప్పట్లో ఈ వాహనం మంచి సక్సెస్ కూడా అయ్యింది.  

 

అయితే ఇప్పుడు అదే అపాచీ మోటారు సైకిల్‌కు కొన్ని కాస్మెటిక్ ట్వీక్స్ అలాగే కొన్ని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి మళ్ళి ఈ వాహనం రానుంది. టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310 ని బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా జనవరి 25, 2020 న కంపెనీ విడుదల చేయనుంది. ఎన్నో కొత్త ఫిచర్లతో వచ్చే ఈ అపాచీ ఆర్ఆర్ 310 ధర దాదాపుగా 2.50 లక్షల రూపాయలు ఉండనుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ బండి లాంఛింగ్ ఒకరకంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ మధ్యతరగతి వారు ఈ బండిని కొనాలంటే కాస్త కష్టమే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: