ఈ మధ్యకాలంలో ఆటో సంస్థలు అన్ని వరుసగా తమ వాహనాలపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించాయి.. ఆ డిస్కౌంట్లను చూస్తే నిజంగా మనకు కళ్ళు తిరుగుతాయి. అంత అద్భుతంగా ఉన్నాయి ఆ డిస్కౌంట్లు. డబ్బు లేకపోయినా సరే ఎలా అయినా కొనాలి అనుకుంటారు అలా ఉన్నాయ్ ఆ డిస్కౌంట్లు. 

 

ఇప్పుడు అంత అద్భుతమైన డిస్కౌంట్ ఇచ్చిన ఆటో మొబైల్ సంస్ద ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకా ఏ సంస్ద.. రెనాల్ట్ సంస్థ. అయితే ఇప్పటికే హ్యుండాయ్, హోండా లాంటి ఆటో సంస్థలు ఈ నెలలోనే తమ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. అయితే తాజాగా రెనాల్ట్ సంస్థ కూడా తన కార్లపై డిస్కౌంట్లు ఇచ్చింది. 

 

అయితే అసలు డిస్కౌంట్ ఏంటి అంటే? తన కార్లపై ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తో పాటు అదనంగా రెనాల్ట్ కార్లపై 10 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ బెనిఫిట్ ఇస్తుంది. రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ డస్టర్, క్విడ్ వాహనాలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అంతేకాదు రెనాల్ట్ ట్రైబర్ మోడల్ పై ఏకంగా 10 వేల రూపాయల లోయల్టి బోనస్, 7 వేల రూపాయల కార్పోరేట్ బోనస్ ను ఈ ఆటో మొబైల్ ఇచ్చింది. 

 

ఇంకా అదే గ్రామానికి చెందిన కస్టమర్లకు మరిన్ని అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది ఈ రెనాల్ట్ సంస్థ. ఇంకా ఈ రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర ఏకంగా రూ.2.92 లక్షలుగా ఉంది. ఇంకా ఈ వాహనంపై 10 వేల రూపాయల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, 15వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ను కస్టమర్ల ముందు ఉంచింది. 

 

కేవలం ఈ ఆఫర్లే కాదు వీటితో పాటు 10 వేల రూపాయల వరకు లోయల్టీ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా కార్పేరెట్ డిస్కౌంట్ అయితే ఏకంగా రెనాల్ట్ క్విడ్ పై 4 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన కారును కోనేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: