నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమా పై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ముందుగా ఈ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఉండేందుకే మేకర్స్ వెనకడుగు వేశారు. దీంతో ఈ సినిమా 21 ఆగస్టు 2026 కి వాయిదా పడింది. నాని తన సినిమా డేట్స్ అన్నీ కూడా ప్యారడైజ్ సినిమాకి కేటాయించడంతో, డైరెక్టర్ సుజిత్ తో తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో షూటింగ్ కూడా ప్రారంభం అవ్వడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
బ్లడీ రోమియో సినిమా కూడా ఆలస్యం కావడంతో డైరెక్టర్ సుజిత్ ను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి 2 సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనుల పైన ప్రత్యేకించి దృష్టి పెట్టినట్లుగా వినిపిస్తున్నాయి. ఓజి సినిమా హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ కథను చాలా పగడ్బందీగా, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుజిత్. ఒకవేళ నాని డేట్స్ అడ్జస్ట్ కాకపోతే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోనే సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. బ్లడీ రోమియో కి డేట్స్ ఎప్పుడు చిక్కితే అప్పుడు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి