కరోనా కారణంగా  ఆర్ధిక వ్యవస్థ కుదెల్ అయిన సంగతి తెలిసిందే..ఇక ఆటో మొబైల్ సంస్థలకు అయితే చెప్పనక్క్లేదు.. తయారైన వాహనాలు అమ్ముడు పోలేక కొత్త ప్రొడక్ట్స్ ను తయారు చేయడం ఆపేశారు. దీంతో ఆయా కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ మేరకు కొన్ని కంపెనీలు మాత్రం ఆ కంపెనీ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. గతంలో కూడా కరోనా వల్ల భారీ తగ్గింపును ప్రకటించాయి. ఇప్పుడు కూడా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కార్ల పై డిస్కౌంట్లు ను అందిస్తుంది. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. వివరాల్లోకి వెళితే..


టాటా సంస్థ 80 వేల వరకు డిస్కౌంటు ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు నెలకు లక్ష రూపాయల వరకు రాయితీ ఇచ్చింది.అందుబాటులో ఉంచింది టాటా మోటార్స్. ముఖ్యంగా డీలర్ల వద్ద అందుబాటులో ఉండే నిర్దిష్టమైన కార్లకే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన ఎక్స్ఎంఏ, ఎక్స్ జెడ్ఏలపై ఎక్కువ ఆఫర్లు ప్రకటించింది. గత నెలలో 80వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చింది...25 వేల క్యాష్ డిస్కౌంట్, 15 వేల రూపాయల అదనపు కార్పోరేట్ ఆఫర్, 40 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ను ఉంది.


అదే యూనిక్ డార్క్ ఎడిషన్ వేరియంటైతే 60 వేల రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆగస్టు నెలకు గాను టాటా మోటార్స్ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అదే కార్పోరేట్ కంపెనీ వర్కర్ అయితే అదనంగా మరో 5 వేల రూపాయల రాయితీ ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ కేవలం డీజిల్ వేరియంట్లకు మాత్రమే ఉంది. అదే ఎంట్రిలెవల్ హ్యాచ్ బ్యాక్ అయిన టాటా టియాగో మోడల్ పై 15 వేల క్యాష్ డిస్కౌంట్ ఇచ్చిందీ సంస్థ. అంతేకాకుండా 10 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కార్పోరేట్ ఆఫర్ 5 వేల రూపాయల వరకు ఇచ్చింది.. గత ఏడాది కూడా ఇదే ఆఫర్లను అందించింది.. కార్లు కొనాలని అనుకేవారికి ఇది నిజంగానే అదిరిపోయే వార్త అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: