కరోనా ప్రభావం దేశాన్ని ఎంతగా కుదిపేస్తోంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా ఎన్నో కంపెనీలు సరైన సేల్స్ అందుకోలేక మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కొత్తగా వాహనాలను తయారు చేయడానికి ఆయా కంపెనీలు సాహసం చెయ్యలేదు.. ఉన్న వాటి మీద భారీ డిస్కౌంట్ లను ప్రకటిస్తున్నాయి.. ఇప్పుడు ప్రముఖ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్. తాజాగా ఈ కంపెనీ తన వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 2021 మాసానికి గాను ప్రత్యేక రాయితీలు కల్పించింది.


ముఖ్యంగా హ్యుండాయ్ శాంత్రో, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, కోనా ఈవీ లాంటి కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.ఈ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్లును కల్పించింది. గరిష్ఠంగా 1.5 లక్షల వరకు రాయితీనిచ్చింది. ఈ ఆఫర్లు మే 1 నుంచి మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా దేశంలో ఉన్న అన్నీ కంపెనీలలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎటువంటి కార్ల పై ఆఫర్ ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


హ్యుండాయ్ ఐ20..

భారత మార్కెట్లో ఈ వాహనం లాంచ్ అయిన దగ్గర నుంచి తొలిసారిగా ఇప్పుడే రాయితీని ప్రకటించింది. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ రూ.15,000ల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో 10వేల ఎక్స్ ఛేంజ్ బోనస్, రూ.5 వేల వరకు కార్పోరేట్ బోనస్ ను కల్పించింది.


హ్యుండాయ్ కోనా ఈవీ..

హ్యుండాయ్ కోనా ఈవీపై గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంటు ఇచ్చింది. ఈ ఈవీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ప్రీమియం, ప్రీమియం డీటీ ఎక్స్ టీరియర్ పెయింట్ స్కీములో లభిస్తుంది. హ్యుండాయ్ సంస్థ తన వెహికల్ లైనప్ లో 60 శాతం కంటే ఎక్కువగా రాయితీలు ప్రకటించింది. ఇందులో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 లాంటి మోడళ్లు కూడా ఉన్నాయి ఉన్నాయని తెలుస్తోంది..


హ్యుండాయ్ శాంత్రో..

ఈ కంపెనీకి చెందిన ఎంట్రీ లెవల్ శాంత్రో మోడల్ పై భారీ ఆఫర్లను ఇచ్చింది. గరిష్ఠంగా 35 వేల రూపాయల వరకు రాయితీనిచ్చింది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.5,000ల వరకు కార్పోరేట్ డిస్కౌంట్ ను అందిస్తున్నారు..


ఇవి కాక హ్యుందాయ్ ఆరా. వంటి కార్ల పై భారీ డిస్కౌంట్ లు అందించనున్నారు.. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఇంకా ధరలు భారీగా పడనున్నాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: