తారక్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం “డ్రాగన్” అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రత్యేక గీతంలో ఎన్టీఆర్ సరసన డాన్స్ చేయడానికి బాలీవుడ్‌కు చెందిన గ్లామరస్ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయబోతున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, తన అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూర ఫతేహి  అని సమాచారం. ఇప్పటికే ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా కోసం ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, పవర్‌ఫుల్ హీరోయిజం అన్నీ కలిసిన ప్యాకేజ్. ఈసారి కూడా అదే స్థాయిలో కాకుండా, మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇమేజ్‌కు సరిపోయేలా కథను తీర్చిదిద్దేందుకు ఆయన చాలా సమయం కేటాయించాడట. స్క్రిప్ట్ పనులకే ఎక్కువ సమయం తీసుకోవడం వల్లే ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. అందుకే, ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లోనే కాకుండా ఎన్టీఆర్ కెరీర్‌లో కూడా మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్  ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే, ఇది కేవలం గ్లామర్ కోసం కాకుండా కథలో ఒక కీలక మలుపుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీకి తగ్గట్టుగా, నాటు మాస్ స్టైల్‌లో ఈ పాటను డిజైన్ చేయనున్నారని సమాచారం. నూరా ఫతేహి స్టెప్పులు, ఎన్టీఆర్ డాన్స్ కలిస్తే ఈ సాంగ్ థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అభిమానులు ఇప్పటికే ఊహిస్తున్నారు. మొత్తానికి, “డ్రాగన్” అనే ఈ ప్రాజెక్ట్‌పై ప్రతి చిన్న అప్‌డేట్ కూడా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వస్తున్న వార్తలే సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చేస్తున్నాయి. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ మ్యాజిక్ ఎప్పుడు చూడబోతామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: