ఇండియాలో ఫేమస్ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి , ఇండియా కార్ మార్కెట్లోని అనేక విభాగాల్లో కార్లను అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఇక మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో కంపెనీ అమ్ముతున్న మారుతి సుజుకి సియాజ్  ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా రికార్డు సృష్టించడం జరిగింది.ఇక ఈ విభాగంలో ఎక్కువ మంత్లీ సేల్స్ ని నమోదు చేస్తున్న మారుతి సుజుకి సియాజ్ , అమ్మకాల పరంగా మరో కొత్త మైలురాయిని సాధించినట్లు కంపెనీ ప్రకటించడం జరిగింది.ఇక ఇండియాలో ఇప్పటి వరకూ 3 లక్షల యూనిట్లకు పైగా సియాజ్ కార్లను అమ్మినట్లు మారుతీ సుజుకి కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ఇండియాలో సెడాన్ అమ్మకాలు తగ్గుతున్న సమయంలో ఈ కారు మిడ్-సైజ్ సెడాన్ విభాగంలోకి ప్రవేశించించడం జరిగిందని, ఇప్పుడు ఈ మోడల్ ఏకంగా 3 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువ అయ్యిందని, ఇది కంపెనీకి ఓ పెద్ద రికార్డు విజయం అని మారుతి సుజుకి ఇండియా ప్రకటించడం జరిగింది.

ఇక మారుతి సుజుకి ఇండియా తమ మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ మారుతి సియాజ్ ను మొదటి సారిగా 2014 వ సంవత్సరంలో ఇండియా మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కారు BS6 ఉద్గార నిబంధలకు లోబడి అప్‌గ్రేడ్ చేయబడింది. ఇంకా అలానే ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో వుంది. ఇక గతంలో ఈ కార్ లో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులో వుంది.ఇక మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్ ను కంపెనీ రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముతుంది. కాగా,ఈ కార్ లో టాప్-ఎండ్ మోడల్ ధర వచ్చేసి రూ. 11.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఇక ఇందులో విశాలమైన క్యాబిన్ ఇంకా అలాగే ఎక్కువ బూట్ స్పేస్, కంఫర్టబల్ ఇంటీరియర్స్ ఇంకా లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఈ కారులోని ప్రధాన ప్రత్యేకతలు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: