క్రాక్ సినిమా విజయం తో మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవితేజ మరో సినిమాను అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరావు పేరుతో ఈ సినిమా టైటిల్ ను మాస్ మహారాజ్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా జి.వి.ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం మరియు తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు పోస్టర్ లో రవితేజ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కాలికి కడెం కనిపిస్తుండగా ఈ పోస్టర్ కు "వేటాడే ముందు నిశ్శబ్దాన్ని ఫాలో అవ్వండి" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తానని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత రానా పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా రకరకాల పేర్లు వినిపించగా చివరికి రవితేజ ఫిక్స్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: